రైతులకు అన్ని విధాలుగా అండగా ఉంటాం..: మంత్రి కాకాణి
TeluguStop.com
సీఎం జగన్ నిర్ణయాలు ఏపీలోని రైతులకు సత్ఫలితాలను ఇస్తున్నాయని మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి అన్నారు.
రైతులకు ప్రభుత్వం అన్ని రకాలుగా అండగా ఉంటుందని తెలిపారు.తడిసిన ధాన్యం కొనుగోలుకు కూడా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని మంత్రి కాకాణి పేర్కొన్నారు.
అలాగే రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేశామని చెప్పారు.రైతులకు ఎరువులతో పాటు నాణ్యమైన విత్తనాలు అందిస్తున్నామన్నారు.
రైతులకు గిట్టుబాటు ధర కల్పించడమే తమ ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు.కానీ ప్రతిపక్షాలు కావాలనే వైసీపీ ప్రభుత్వంపై కుట్ర పూరితంగా తప్పుడు ప్రచారాలు చేస్తున్నాయని మంత్రి కాకాణి ఆరోపించారు.
క్లాస్‌రూమ్‌లోనే విద్యార్థిపై దాడికి పాల్పడిన టీచర్.. వీడియో వైరల్ కావడంతో?