దళిత బంధులో మోసపోయిన బాధితులకు అండగా ఉంటాం:పిల్లుట్ల శ్రీనివాస్

దళిత బంధులో మోసపోయిన బాధితులకు అండగా ఉంటాం:పిల్లుట్ల శ్రీనివాస్

సూర్యాపేట జిల్లా:కోదాడ మండలం( Kodad Mandal ) గుడిబండ దళితబంధు పథకంలో మోసపోయిన బాధితులను బెదిరింపులకు గురి చేస్తే సహించేది లేదని బీఎస్పి కోదాడ నియోజకవర్గ ఇంచార్జ్ పిల్లుట్ల శ్రీనివాస్ ( Pillutla Srinivas )హెచ్చరించారు.

దళిత బంధులో మోసపోయిన బాధితులకు అండగా ఉంటాం:పిల్లుట్ల శ్రీనివాస్

బుధవారం గుడిబండలో దళిత బంధు పథకంలో మోసపోయిన లబ్ధిదారులను కలిసి వారికి బీఎస్పీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.

దళిత బంధులో మోసపోయిన బాధితులకు అండగా ఉంటాం:పిల్లుట్ల శ్రీనివాస్

అనంతరం ఆయన మాట్లాడుతూఒక దళిత బంధు పథకాన్ని నలుగురికి పంచారని,లబ్ధిదారుల వద్ద అడ్వాన్స్ గా పథకం మంజూరుకు డబ్బులు తీసుకున్నారన్నారు.

దళిత బంధు పథకంలో జరిగిన అవినీతిపై చర్యలు తీసుకుంటానని సాక్షాత్తుగా ముఖ్యమంత్రి కేసీఆర్( CK KCR ) బహిరంగంగా వెల్లడించారని, మంగళవారం విలేకరుల సమావేశంలో ఎంపీపీ కవితారెడ్డి దళిత బంధు పథకంలో తాము చేసిన అవినీతికి సాక్ష్యాలు లేవని అన్నారని,ప్రస్తుతం తమ ముందు ఉన్న బాధితులే సాక్ష్యాలని,ఇప్పుడు రాజకీయ సన్యాసం పుచ్చుకుంటారా అని ప్రశ్నించారు.

దళిత బంధు పథకంలో అన్యాయం జరిగిన వారందరికీ న్యాయం జరిగే వరకూ బహుజన సమాజ్ పార్టీ పోరాడుతుందన్నారు.

ఈ కార్యక్రమంలో కోదాడ కోదాడ నియోజకవర్గ అధ్యక్షులు కందుకూరు ఉపేందర్,వెంపటి నాగమణి తదితరులు పాల్గొన్నారు.

అంగన్‌వాడీ ఉద్యోగం కోసం రూ.70 వేలు డిమాండ్ చేసిన అధికారి.. వీడియో వైరల్!

అంగన్‌వాడీ ఉద్యోగం కోసం రూ.70 వేలు డిమాండ్ చేసిన అధికారి.. వీడియో వైరల్!