త్వరలోనే కాంగ్రెస్ ప్రభుత్వ పెద్దలను కలుస్తాం..: అల్లు అరవింద్

తెలంగాణలో కొత్త ప్రభుత్వంపై సినీ నిర్మాత అల్లు అరవింద్ కీలక వ్యాఖ్యలు చేశారు.

రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కార్ రావడం సంతోషకరంగా ఉందని పేర్కొన్నారు.సినీ పరిశ్రమలను ఆదుకోవడం కాంగ్రెస్ ప్రభుత్వానికి కొత్త కాదని అల్లు అరవింద్ తెలిపారు.

గత ప్రభుత్వాలు కూడా సినీ పరిశ్రమలను ఎంతో ప్రోత్సహించాయని పేర్కొన్నారు.ఈ ప్రభుత్వం కూడా సినీ పరిశ్రమను ప్రోత్సహిస్తుందనుకుంటున్నామని వెల్లడించారు.

ఈ క్రమంలోనే త్వరలోనే కాంగ్రెస్ ప్రభుత్వ పెద్దలను కలుస్తామని స్పష్టం చేశారు.

‘‘డే విత్ సీబీఎన్’’.. ఒక రోజంతా సీఎం చంద్రబాబుతో గడిపిన ఎన్ఆర్ఐ , ఎవరీ నవీన్ కుమార్?