నల్లగొండ జిల్లా ప్రాజెక్టులకు అన్యాయం చేస్తే సహించం

నల్లగొండ జిల్లా:నల్గొండ జిల్లా ప్రజలకు,రైతాంగానికి నష్టం కలిగించే ప్రయత్నం కేసీఆర్ చేస్తున్నాడని, నల్లగొండ జిల్లా ప్రాజెక్టులకు అన్యాయం చేస్తే సహించేది లేదని టీపీసీసీ స్టార్ క్యాంపెయినర్, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఆదివారం జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో ఆయన మాట్లాడుతూ ఎస్సెల్బీసీకి కేటాయించబడిన నీటిని రద్దు చేస్తూ జీవో విడుదల చేసిందని,దీంతో నల్గొండ జిల్లా ప్రజలకు రైతుంగానికి తీవ్ర నష్టం కలుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు.

1980 లో జరిగిన ఒప్పందం ప్రకారం నల్గొండ జిల్లా ప్రజలకు ఎస్సెల్బీసీ ద్వారా 45 టిఎంసీలు కేటాయింపులు జరిగాయని గుర్తు చేశారు.

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 8 యేండ్లుగా నల్గొండ జిల్లా రైతాన్గానికి అన్యాయం చేస్తుందన్నారు.

ఎస్సేల్బిసి ద్వారా నల్గొండ జిల్లాకు దక్కాల్సిన 45 టిఎంసిల నీటిని పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ కి కేటాయిస్తూ తెలంగాణ ప్రభుత్వం జీవో నెంబర్ 246 ని తెచ్చిందని,దీనితో కేసీఆర్ నల్గొండ,మహబూబ్ నగర్ జిల్లాల ప్రజల మధ్య కొట్లాట పెట్టే ప్రయత్నం చేస్తున్నాడని ఆరోపించారు.

కృష్ణా నది నుండి ఏపీ సీఎమ్ జగన్ రోజుకు 8 నుండి 11 టిఎంసిల నీటిని తోడుకుపోతున్నా తెలంగాణ ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లే ఉందని,ఫ్లో్రైడ్ బయటికి తీసుకొచ్చింది మేమే,రూపుమాపింది కూడా మేమేనని అన్నారు.

ఉత్తర తెలంగాణలో ఉన్న ప్రాజెక్ట్ ల కెనాల్స్ బాగా ఉన్నాయని,మా దగ్గర కెనాల్స్ లైనింగ్ పూర్తిగా దెబ్బతిన్నదని,బాగు చేయడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారని కారణం ఏమిటో చెప్పాలని ప్రశ్నించారు.

జీవో నెంబర్ 246 ని వెంటనే రద్దు చేయాలని,రద్దు చేయకుంటే జిల్లా కేంద్రంలో దీక్షకు సిద్ధంగా ఉన్నామని హెచ్చరించారు.

జీవో రద్దు చేయాలని సీఎంకి లేఖ రాస్తానని అవసరమైతే అపాయింట్మెంట్ తీసుకుని కలుస్తానని తెలిపారు.

ఎస్సెల్బీసీ 30 టిఎంసిలు,పాలమూరు రంగారెడ్డికి 40,డిండి ఎత్తిపోతలకు 20 టిఎంసిలు కేటాయించాలని సూచించారు.

నల్గొండ జిల్లా మహబూబ్ నగర్ జిల్లాల మధ్య రక్తపాతం జరిగితే దానికి కారణం కేసీఆర్ అవుతారని స్పష్టం చేశారు.

ఓవర్సీస్ లో కల్కి ఫస్ట్ డే కలెక్షన్ల లెక్కలివే.. సరికొత్త రికార్డ్ సొంతం చేసుకుందిగా!