ఫోన్ ట్యాపింగ్ అంశంపై గవర్నర్ ను కలుస్తాం..: ఎంపీ లక్ష్మణ్
TeluguStop.com
బీజేపీ ఎంపీ లక్ష్మణ్( BJP MP Laxman ) కీలక వ్యాఖ్యలు చేశారు.
కాంగ్రెస్, బీఆర్ఎస్ కలిసే డ్రామాలాడుతున్నాయని పేర్కొన్నారు.ఫోన్ ట్యాపింగ్ అంశం( Phone Tapping Issue ) దేశ భద్రత, వ్యక్తిగత భద్రతకు సంబంధించినదని తెలిపారు.
సీఎం రేవంత్ రెడ్డికి( CM Revanth Reddy ) చిత్తశుద్ధి ఉంటే ఫోన్ ట్యాపింగ్ పై సీబీఐ దర్యాప్తు జరిపించాలని పేర్కొన్నారు.
ఎన్నికల ప్రక్రియను ప్రభావితం చేసే అంశం కాబట్టి కేంద్రం కూడా దర్యాప్తు చేయాల్సిన అవసరం ఉందని తెలిపారు.
ఈ క్రమంలోనే ఫోన్ ట్యాపింగ్ అంశంపై గవర్నర్ ను కలుస్తామని వెల్లడించారు.రానున్న లోక్ సభ ఎన్నికల్లో( Lok Sabha Elections ) బీజేపీ మెజార్టీ స్థానాలను కైవసం చేసుకుంటుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
ఇక టార్గెట్ కొడాలి నాని ? అన్నీ సిద్ధం చేస్తున్నారా ?