మ్యానిఫెస్టోలో పెట్టిన ప్రతి హామీని నెరవేరుస్తాం:ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్
TeluguStop.com
నల్లగొండ జిల్లా:కాంగ్రెస్ పార్టీ మ్యానిఫెస్టోలో పెట్టిన ప్రతిని హామీని తప్పక నెరవేరుస్తామని ఎన్ఎస్ యుఐ రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ ( MLC Balmuri Venkat )అన్నారు.
మంగళవారం నల్గొండలోని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి క్యాంపు కార్యాలయంలో మాజీ ఎమ్మెల్సీ కపిలవాయి దిలీప్ కుమార్ తో కలిసి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎన్నికల కోడ్ ముగిసిన వెంటనే మళ్లీ అన్ని సంక్షేమ పథకాలు ప్రారంభమవుతాయని స్పష్టం చేశారు.
అదేవిధంగా జాబ్ క్యాలెండర్ తో పాటు నోటిఫికేషన్ పై సంపూర్ణ స్పష్టత ఇస్తామని వెల్లడించారు.
జీవో నెంబర్ 46,317,ఇతర ఉద్యోగుల సమస్యలఫై తమ ప్రభుత్వం క్యాబినెట్ సబ్ కమిటీ వేసి పరిష్కరిస్తుందన్నారు.
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తీన్మార్ మల్లన్న గెలుపు కోసం కృషి చేయాలని కోరారు.
బీజేపీ, బీఆర్ఎస్( BJP, BRS ) పార్టీలు కుమ్మక్కై తీన్మార్ మల్లన్నను ఓడించేందుకు కుట్ర పూరిత వ్యాఖ్యలు చేస్తున్నాయని విమర్శించారు.
ప్రజలంతా దీనిని గమనించాలని కోరారు.గత పదేళ్ళుగా బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన ప్రజా వ్యతిరేక విధానాలపై తీన్మార్ మల్లన్న పోరాటం చేసి తీవ్రంగా ఎండగట్టాడని గుర్తు చేశారు.
ప్రశ్నించే గొంతు తీన్మార్ మల్లన్న చట్టసభలలో ఉంటే నిరుద్యోగులకు న్యాయం జరుగుతుందన్నారు.పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో గ్రాడ్యుయేట్ ఓటర్లంతా ఆలోచించి ఓటేసి మొదటి ప్రాధాన్యత ఓటుతో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తీన్మార్ మల్లన్నను గెలిపించాలని కోరారు.
అనంతరం మాజీ ఎమ్మెల్సీ కపిలవాయి దిలీప్ కుమార్ మాట్లాడుతూ బీజేపీ, బీఆర్ఎస్ ప్రభుత్వాలు గత పది సంవత్సరాలుగా నిరుద్యోగులను అన్ని విధాలుగా మోసం చేశాయని విమర్శించారు.
కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వ విధానాలపై నిరుద్యోగులంతా ఆగ్రహంతో ఉన్నారని తెలిపారు.తెలంగాణ ప్రజలంతా పోరాటం సాగించి ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం సాధించుకుంటే కేసీఆర్ పాలనలో అన్ని వ్యవస్థలు విధ్వంసం అయ్యాయని అన్నారు.
ఎమ్మెల్సీ ఎన్నికలలో ప్రశ్నించే గొంతుకైన తీన్మార్ మల్లన్నను గెలిపించాలని కోరారు.సెక్యులర్ పార్టీ అయిన కాంగ్రెస్ పార్టీతోనే ప్రజలు,నిరుద్యోగుల సమస్యలు పరిష్కారం అవుతాయన్నారు.
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ద్వారానే తెలంగాణ ప్రజల ఆకాంక్షలు,ఆశలు నెరవేరుతాయని తెలిపారు.ఈ విలేకరుల సమావేశంలో డిసిసి అధ్యక్షుడు కేతావత్ శంకర్ నాయక్,నల్గొండ పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గుమ్ముల మోహన్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి,జెడ్పిటిసి వంగూరి లక్ష్మయ్య,మాజీ జెడ్పిటిసి గుంజ రేణుక, పార్టీ నాయకులు సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.
పవన్ కళ్యాణ్ పాన్ ఇండియాలో సక్సెస్ సాధిస్తాడా..?