అచ్చంపేట ఘటనపై ఈసీకి ఫిర్యాదు చేస్తాం..: మల్లు రవి
TeluguStop.com
మహబూబ్ నగర్ జిల్లా అచ్చంపేట నియోజకవర్గంలో చోటు చేసుకున్న ఘటనపై కాంగ్రెస్ పార్టీ నేత మల్లు రవి స్పందించారు.
అచ్చంపేటలో ఎమ్మెల్యే గువ్వల అరాచక శక్తిగా మారారని విమర్శించారు.సానుభూతి కోసమే ఎమ్మెల్యే బాలరాజు ఆస్పత్రిలో చేరారని మల్లు రవి అన్నారు.
ఎన్నికల్లో డబ్బుల సంచులతో రాజకీయాలు చేస్తున్నారన్న ఆయన నిన్న ఎమ్మెల్యే తన కారులో డబ్బు సంచులతో వెళ్తుంటే కాంగ్రెస్ కార్యకర్తలు అడ్డుకున్నారని చెప్పారు.
ఈ క్రమంలో ఎమ్మెల్యే గువ్వల అనుచరులే కాంగ్రెస్ కార్యకర్తలపై దాడులు చేశారని ఆరోపించారు.
కానీ కాంగ్రెస్ వాళ్లే దాడులు చేశారని అబద్ధపు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.పోలీసులు సైతం చూసి చూడనట్లు వ్యవహారిస్తున్నారన్న మల్లు రవి ఘటనపై ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేస్తామని తెలిపారు.
ఇండియన్ సైంటిస్టుల సత్తా.. స్పేస్‌లో డాకింగ్ ప్రయోగం సక్సెస్.. ఎలైట్ క్లబ్‌లో భారత్!