మూడోసారి కూడా అధికారంలోకి వస్తాం: హరీష్ రావు

నేరేడుచర్ల మున్సిపాలిటీ పరిధిలోని ఏడో వార్డు రామాపురంలో 13 లక్షల వ్యయంతో ఏర్పాటు చేసిన బస్తీ దవాఖానను రాష్ట్ర విద్యుత్ శాఖా మంత్రి జగదీశ్ రెడ్డి( Jagdish Reddy ), హుజూర్ నగర్ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి లతో కలిసి రాష్ట్ర వైద్య ఆరోగ్య మరియు ఆర్ధిక శాఖా మంత్రి తన్నీరు హరీష్ రావు శుక్రవారం ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం పట్టణ ప్రజల కోసం బస్తి దవాఖాలు ప్రారంభించిందన్నారు.

సీఎం కేసీఆర్ ప్రజలకు ఉపయోగపడే పథకాలు ప్రవేశపెడుతున్నారని, ప్రజల కోసం ప్రవేశపెట్టిన పథకాలే రాబోయే ఎన్నికల్లో మూడవసారి కూడా బీఆర్ఎస్ పార్టీని గెలిపిస్తాయని,మళ్లీ కెసిఆర్ ముఖ్యమంత్రి అవుతారని ధీమా వ్యక్తం చేశారు.

రాష్ట్రంలో 40,50 స్థానాలలో కాంగ్రెస్ పార్టీకి అభ్యర్థులు కూడా కరువయ్యారని ఎద్దేవా చేశారు.

అనంతరం బస్తీ ధవాఖాన వైద్యాధికారి వంశీని శాలువాతో సన్మానించారు.ఈ కార్యక్రమంలో ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్,మిర్యాలగూడ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కరరావు,కోదాడ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్,నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య,సూర్యాపేట జెడ్పీ చైర్మన్ బొజ్జల దీపిక యుగేందర్,తాహాసిల్దార్ వి.

సరిత,నేరేడుచర్ల మున్సిపల్ చైర్మన్ చందమల్ల జయబాబు, వైస్ చైర్మన్ చల్లా శ్రీలత రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

ఫస్ట్ టైం కాబోయే భార్యతో ఫోటోని షేర్ చేసిన చైతన్య.. శోభిత రియాక్షన్ ఇదే?