‘‘ ఆకలితో అలమటిస్తున్నా.. బయటకి వెళ్లలేను ’’ : కిర్గిస్థాన్‌లో భారత విద్యార్ధుల కన్నీటి గాథ

కిర్గిస్తాన్‌లో ( Kyrgyzstan ) ఇంకా టెన్షన్ వాతావరణం కొనసాగుతోంది.విదేశీ విద్యార్ధులే లక్ష్యంగా అల్లరి మూకలు రెచ్చిపోతుండటంతో పరిస్ధితులు నానాటికీ దిగజారుతున్నాయి.

అంతర్జాతీయ విద్యార్ధులు ఉన్న ప్రాంతాల్లో అక్కడి ప్రభుత్వం కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేసినప్పటికీ, వారంతా హాస్టల్ గదులకే పరిమితం కావాల్సిన పరిస్ధితులు నెలకొన్నాయి.

విద్యాసంస్థలు సైతం పరీక్షలను వాయిదా వేయగా .చాలామంది భారత్‌కు తిరిగి వచ్చేందుకు సిద్ధమయ్యారు.

అయితే కిర్గిస్థాన్‌లోని భారత రాయబార కార్యాలయం( Indian Embassy ) మాత్రం అక్కడ పరిస్ధితి అదుపులోనే ఉందని తెలిపింది.

ఈ ఘటనలపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి( CM Revanth Reddy ) ఆరా తీశారు.

సీఎం ఆదేశాల మేరకు అధికారులు బిష్కెక్‌లోని భారత రాయబారితో మాట్లాడారు. """/" / ఈ నేపథ్యంలో భారతీయ విద్యార్ధులు( Indian Students ) తమ ఇబ్బందులను సోషల్ మీడియా ద్వారా పంచుకుంటున్నారు.

వక్వార్ అనే వైద్య విద్యార్ధి మాట్లాడుతూ.గత మూడు రోజులుగా టీ, దోసకాయలు తింటూ బతుకుతున్నానని ఆవేదన వ్యక్తం చేశారు.

మే 17 నుంచి మమ్మల్ని లోపలే ఉంచారని.మే 19న తాను కేఎఫ్‌సీ నుంచి ఆహారం తెచ్చుకునేందుకు ప్రయత్నించగా స్థానికులు తనను వెంబడించి కొట్టారని వక్వార్ తెలిపారు.

డెలివరీ బాయ్‌లు స్థానిక ముఠాల నుంచి డబ్బు తీసుకుని మేం ఎక్కడుంది చెబుతూ ఉండటంతో తాము ఆన్‌లైన్‌లో ఆర్డర్ చేయలేకపోతున్నానని వక్వార్ పేర్కొన్నారు.

తాను ఇంటికి వెళ్లాలనుకుంటున్నానని.కానీ వచ్చే మూడు నెలల అద్దె ఇస్తే కానీ తనను వెళ్లనివ్వనని యజమాని బెదరిస్తున్నాడని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

తల్లిదండ్రులు మాకు విమాన టికెట్లు ఏర్పాటు చేస్తున్నారని.కానీ మేం ఎయిర్‌పోర్ట్‌కు ఎలా చేరుకోవాలి అని వక్వార్ ప్రశ్నిస్తున్నారు.

"""/" / పంజాబ్, హర్యానా సహా 2 వేల మంది సహా మొత్తంగా బిష్కెక్‌లో( Bishkek ) 10 వేలమంది భారతీయ విద్యార్ధులు ఉన్నట్లు అంచనా.

బిష్కెక్‌లో మూక దాడుల కారణంగా వీరంతా బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు.అంతేకాదు.

ఈ పరిణామాలు ఒక నెలలో ప్రారంభంకానున్న అడ్మిషన్ సీజన్‌లో భారత్ నుంచి వచ్చే కొత్త విద్యార్ధుల రాకపై ప్రభావం చూపనున్నాయి.

రోడ్లపై అల్లరిమూకల స్వైర విహారం తగ్గినప్పటికీ తాము బయటికి వచ్చినప్పుడల్లా తమను లక్ష్యంగా చేసుకుంటున్నారని భారతీయ విద్యార్ధులు చెబుతున్నారు.

ఇదే అదనుగా కొందరు ఇంటి యజమానులు అద్దెను పెంచి పరిస్ధితిని సొమ్ము చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.

"""/" / స్థానిక రాయబార కార్యాలయం ఏర్పాటు చేసిన హెల్ప్‌లైన్ నుంచి తమకు ఎలాంటి సహాయం లభించడం లేదని విద్యార్ధులు ఆరోపిస్తున్నారు.

వారి స్వస్థలాల్లోని ఎమ్మెల్యే, ఎంపీలు, ఇండియన్ ఫారిన్ మెడికల్ స్టూడెంట్స్ అసోసియేషన్ వంటి సంఘాల ద్వారా విద్యార్ధులు స్వదేశానికి తిరిగి రావాలని భావిస్తున్నారు.

అలాగే తదుపరి సెమిస్టర్ క్లాసులు ఆన్‌లైన్‌లో నిర్వహించేలా కిర్గిస్తాన్ ప్రభుత్వంతో మాట్లాడాలని కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు.

బాలినేని ట్రబుల్ పాలిటిక్స్ … దామచర్ల తో ఇబ్బందే