పశువులు, పక్షుల దాహం తీర్చేందుకు మన వంతు సహకారం అందించాలి
TeluguStop.com
రాజన్న సిరిసిల్ల జిల్లా: పశువులు, పక్షుల దాహం తీర్చేందుకు మనవంతు సహకారం అందించాలని రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి( Collector Anurag Jayanthi ) ఒక ప్రకటనలో తెలిపారు.
వేసవికాలం ఉష్ణోగ్రతలో పెరుగుతున్న నేపథ్యంలో మూగజీవాలు చుక్క నీటి కోసం మైళ్ళ దూరం ప్రయాణిస్తూ ప్రాణాలు కోల్పోతున్నాయని, పక్షి జాతుల్లో కొన్ని అంతరించిపోవడానికి వేసవి కూడా ఒక కారణమని అధ్యయనాలు వెల్లడిస్తున్నాయని, ఇలాంటి పరిస్థితుల్లో పక్షులు పశువుల దాహం తీర్చడానికి మన వంతు సహకారం మనమంతా చేయాలని , మన ఇంటి ప్రాంగణంలో గిన్నెలో నీళ్లు ఏర్పాటు చేయాలని కలెక్టర్ కోరారు.
జిల్లాలోని పశుసంవర్ధక శాఖ( Department Of Animal Husbandry ) ఆధ్వర్యంలో పశువుల, పక్షుల సంరక్షణకు కావాల్సిన ఆహారం నీళ్లు షెల్టర్ ఇతర వైద్య సహకారం అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని, అదేవిధంగా పశువుల సంక్షేమ సంస్థలు, పశు ప్రేమికులు వివిధ స్వచ్ఛంద సంస్థల సహకారంతో పెద్ద ఎత్తున అవగాహన కార్యక్రమాలు నిర్వహించి ప్రతి ఒక్కరు ఇంటి వద్ద గిన్నెలో నీళ్లు పెట్టడం వల్ల కొంత వారి దాహార్తిని తీర్చగలుగుతామని ఆ ప్రకటనలో ఆయన పేర్కొన్నారు.
పవన్ కళ్యాణ్ దేశానికి వెన్నెముక.. వైరల్ అవుతున్న మాధవీలత ఆసక్తికర వ్యాఖ్యలు!