ప్రీతి మృతికి కారణమైన సైఫ్ ను ఎన్కౌంటర్ చేయాలి.

ఎల్లారెడ్డిపేట : ప్రీతి మృతికి కారణమైన సైఫ్ ను ఎన్కౌంటర్ చేయాలని ఎల్లారెడ్డిపేట భారతీయ జనతా పార్టీ ఎస్టి మోర్చా మండల శాఖ భోడవత్ రవీందర్ అన్నారు.

ఈ సందర్భంగా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం నిర్లక్ష్యాన్ని, విద్యాసంస్థల్లో ర్యాగింగ్ ని నియంత్రించలేని కెసిఆర్ ప్రభుత్వం ఈ మృతికి పూర్తి బాధ్యత వహించాలన్నారు.

అలాగే ప్రీతి పై కక్ష కట్టి మానసికంగా వేధిస్తూ ఈరోజు తన చావుకు కారణమైన సైఫ్ పై వెంటనే హత్యకేసు నమోదు చేసి ఎన్కౌంటర్ చేయాలని డిమాండ్ చేశారు.

బాధితురాలి కుటుంబానికి వెంటనే న్యాయం చేయాలని అన్నారు.ఈ కార్యక్రమంలో దరావత్ రవీందర్ నాయక్ ,సాయికిరణ్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.

వీడియో: ఇదెక్కడి పిచ్చి పని.. ఫైర్‌క్రాకర్ బాక్స్‌పై కూర్చోబెట్టి చంపేశారు..?