భారత్ సాయంతోనే ఆర్థిక సంక్షోభం నుండి బయటపడ్డాం శ్రీలంక అధ్యక్షుడు కీలక వ్యాఖ్యలు..!!

కొద్ది నెలల క్రితం పొరుగు దేశం శ్రీలంక( Sri Lanka ) ఆర్థిక సంక్షోభంలో పడిపోయిన సంగతి తెలిసిందే.

దీంతో ఇంధన ధరలు, నిత్యవసరాల ధరలు భారీగా పెరిగిపోయాయి.ఆర్థిక సంక్షోభంతో లంక ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

ఆ సమయంలో భారత్ ఎంతగానో సాయపడింది.ఇదిలా ఉంటే తాజాగా శ్రీలంక అధ్యక్షుడు రణిల్ విక్రమసింఘే( Ranil Wickramasinghe ) భారత్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఆర్థిక సంక్షోభం నుంచి శ్రీలంక బయటపడటానికి భారత్ అందించిన 3.5 బిలియన్ డాలర్ల సాయం ఎంతో మేలు చేసిందని చెప్పుకొచ్చారు.

భారత్ అందించిన సాయం వల్ల ఆర్థిక సంక్షోభం నుంచి బయటపడ్డామని రణిల్ విక్రమసింఘే వ్యాఖ్యానించారు.

ఇందుకు కృతజ్ఞతలు తెలిపారు. """/" / రాబోయే రోజుల్లో ఆ మొత్తాన్ని తిరిగి చెల్లిస్తామన్నారు.

కొలంబోలో జరిగిన అఖిల భారత భాగస్వామి సదస్సులో శ్రీలంక అధ్యక్షుడు ఈ వ్యాఖ్యలు చేయడం జరిగింది.

ఇండియాతో కలిసి పని చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు పేర్కొన్నారు.ఇదే విషయంపై ప్రధాని మోదీతో( Prime Minister Modi ) కూడా చర్చించినట్లు వివరించారు.

ఇరుదేశాలు సంయుక్తంగా పనిచేసే ముఖ్యమైన రంగాలలో పర్యావరణ అనుకూల ఇంధనం ఒకటని రణిల్ విక్రమసింఘే స్పష్టం చేయడం జరిగింది.

రెండు దేశాల మధ్య గ్రిడ్ ఇంటర్ కనెక్షన్ ద్వారా పర్యావరణ అనుకూల శక్తిని భారతదేశానికి పంపవచ్చు.

మాకు సాంపూర్ సోలార్ ప్రాజెక్టు ఉంది.ఇది అంతర్ ప్రభుత్వ ప్రాజెక్ట్.

3 ద్వీపాల ప్రాజెక్టు.ఎక్కడ జులాయిలో పునాదిరాయి వేయాలని మేము ఆశిస్తున్నాము" అని శ్రీలంక అధ్యక్షుడు స్పష్టం చేశారు.

హిందీలోకి వెళ్తున్న సంక్రాంతికి వస్తున్నాం… హీరో అతనేనా?