పెన్షన్ల పంపిణీలో మనమే నెంబర్ వన్.. మంత్రి పువ్వాడ

పెన్షన్ల పంపిణీలో మనమే నెంబర్ వన్.అందరికీ సంక్షేమం అందాలని ముఖ్యమంత్రి కేసీఅర్ గారి తాపత్రయం.

వయసు 65 నుండి 57కు కుదించి మరింత మందికి ఆసరా గా నిలిచారు.

పెన్షన్ ఆర్డర్స్, గుర్తింపు కార్డ్స్ పంపిణీ చేసిన మంత్రి పువ్వాడ.వృద్ధులు, వితంతువులు, వికలాంగులు, ఒంటరి మహిళలు, బీడీ కార్మికులు తదితర వర్గాల వారికి పెన్షన్లను అందిస్తూ ముఖ్యమంత్రి కేసీఅర్ గారు తన పెద్ద మనసు చాటుకున్నారని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ గారు అన్నారు.

ఖమ్మం కార్పొరేషన్ లోని 2, 3, 5, 9, 12, 13, 44, 49, 54 డివిజన్ల లబ్ధిదారులకు పెన్షన్ల మంజూరు పత్రాలు స్వయంగా పంపిణీ చేశారు.

జిల్లాలో ఇప్పటికే 1.50 లక్షల మందికి వివిధ రకాల ఆసరా పెన్షన్లు అందుతుండగా, కొత్తగా 49 వేల మందికి పెన్షన్ల జాబితాలో చోటు కల్పించడం గర్వకారణమన్నారు.

ఖమ్మం కార్పొరేషన్ లో గతంలో 22 వేల పై చీలుకు ఉండగా కొత్తగా 7వేల పై చీలుకు మొత్తం ఒక్క ఖమ్మం కార్పొరేషన్ కే 30వేల పెన్షన్స్ ఇవ్వడం గర్వకారణమన్నారు.

గతంలో ఖమ్మంలో తోలి సారి ఎమ్మెల్యేగా ఎన్నికైన తోలినాళ్ళలో ఇదే 20వేల మందికి పెన్షన్లు వచ్చే విధంగా నాడు కలెక్టరేట్ ఎదుట ధర్నా చేసి సాధించుకున్నామని గుర్తు చేశారు.

పేదల సంక్షేమమే పరమావధిగా సీఎం కేసీఆర్‌ గారు కొత్త పెన్షన్లు మంజూరు చేస్తూ సాహసోపేత నిర్ణయం తీసుకున్నారన్నారని, నేడు రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకం ఇంటికి ఏదో ఒక రూపంలో అందించడం జరుగుతుంది అని అన్నారు.

పెన్షన్లు పంపిణీ చేయడంలో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే నెంబర్ వన్ గా ఉందని, తెలంగాణ తరహాలో దేశంలోని మరే ఇతర రాష్ట్రాల్లో పెన్షన్ల పంపిణీ జరగడం లేదనిమంత్రి పువ్వాడ గారు స్పష్టం చేశారు.

గతంలో పెన్షన్ అంటే ప్రభుత్వ ఉద్యోగాలు చేసి పదవి విరమణ పొందిన వారికి ఇవ్వడం మనకి తెలుసు.

తెదేపా హాయంలో రూ.70 ఇవ్వగా కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో రూ.

200 ఇచ్చారని అది కూడా సకాలంలో ఇచ్చిన దాఖలాలు లేవన్నారు.ఆయా అరకొర పెన్షన్ ను తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుని రూ.

2000 వేలు ఇవ్వాలని ముఖ్యమంత్రి కేసీఅర్ గారు పెద్ద మనసుతో ప్రకటించడంతో పాటు నిర్విరామంగా కొనసాగించడం వారికే సాధ్యమైందన్నారుతద్వారా నేడు సమాజంలో వృద్దులకు, వికలాంగులకు పెన్షన్ల ద్వారా గౌరవ, మర్యాదలు కల్పించబడ్డాయని అన్నారు.

వయసు పైబడిన వారు చివరి దశలో ఇతరులపై ఆధారపడకుండా గౌరవప్రదమైన జీవనం గడిపేందుకు 57 సంవత్సరాలు నిండిన వారికి కూడా పెన్షన్లు అందిస్తున్న ఘనత సీఎం కేసీఆర్ గారికే దక్కిందన్నారు.

దేశంలోనే మరెక్కడా లేనివిధంగా బీడీ కార్మికులకు తెలంగాణ రాష్ట్రంలో పెన్షన్లు అందిస్తున్నారని పేర్కొన్నారు.

సీఎం కెసిఆర్ గారి నేతృత్వంలో దేశంలో ఎక్కడా లేని విధంగా అభివృద్ధి, సంక్షేమ పథకాలను అమలు అవుతున్నాయన్నారు.

మన రాష్ట్రంలో అమలు అవుతున్న పథకాలు దేశంలో ఎక్కడా లేవని, ఆసరా పెన్షన్లు దాదాపు అర కోటి మందికి ఇస్తున్నామన్నారు.

దేశంలో పెన్షన్లు వృద్ధులకు, దివ్యాంగులకు మాత్రమే ఇస్తున్నారు కానీ, మన రాష్ట్రంలో బీడీ కార్మికులకు, వితంతువులకు, హెచ్ఐవి, బోదకాలు బాధితులకు, తాజాగా డయాలిసిస్ పేషెంట్లకు కూడా పెన్షన్లు ఇస్తున్న మహానుభావుడు కెసిఆర్ గారు అని అన్నారు.

అభివృద్ధి నమూనాగా గొప్పలు చెప్పుకునే గుజరాత్ రాష్ట్రంతో పోలిస్తే తెలంగాణలో 20 రెట్లు అధికంగా పెన్షన్లు పంపిణీ చేస్తున్నామని వివరించారు.

కార్పోరేట్లకు, బడా బాబులకు వత్తాసు పలికే కేంద్ర ప్రభుత్వం ఉచితాలు ఇవ్వొద్దు అని నిస్సిగ్గుగా బహిరంగంగా మాట్లాడటం సిగ్గుచేటన్నారు.

ప్రజలు వాస్తవాలను గుర్తించాలని, తెలంగాణాలో కేసీఆర్ గారి సంక్షేమ ప్రభుత్వ పాలనకు మద్దతుగా నిలువాలని కోరారు.

కార్యక్రమంలో ఎంపీ వద్దిరాజు రవిచంద్ర గారు, మేయర్ పునుకొల్లు నీరజ గారు, మున్సిపల్ కమిషనర్ ఆదర్శ్ సురభి గారు, సుడా చైర్మన్ విజయ్ గారు, కార్పొరేటర్లు, నాయకులు ఉన్నారు.

ఇడ్లీ, సాంబార్ ట్రై చేసిన రష్యన్ యువతి.. ఆమె రియాక్షన్ ఇదే..?