అన్నీ నోట్ చేస్తున్నాం..! లెక్కలు అన్నీ తేలుస్తాం..!!
TeluguStop.com
మాజీ మంత్రి బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ సీఎం కేసీఆర్ పై మరోసారి ఫైర్ అయ్యారు.
అన్ని గుర్తుంచుకుంటామని.తర్వాత లెక్కలన్నీ తీరుస్తామని అన్నారు.
కేసీఆర్ చేస్తున్న పనులకు సంబంధించి అన్ని లెక్కలు రాసుకుంటున్నామని వడ్డీతో సహా తీర్చేస్తామని అనడం చర్చనీయాంశంగా మారింది.
బీజేపీలో చేరేవారిని కేసులతో భయపెడుతున్నారని ఆరోపించారు.టీఆర్ఎస్ లో తాను ఉన్నన్ని రోజులు ఏ కేసులు పెట్టలేదు కానీ.
బీజేపీలో చేరగానే కేసులు గుర్తొచ్చాయా అని మండిపడ్డారు.అన్నీ గుర్తించుకుంటామంటూ కేసీఆర్ ని హెచ్చరించారు.
ప్రజాప్రతినిధులపై కూడా రాత్రికి రాత్రే కేసులు నమోదు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
పోలీసులు అధికారులు ఏకపక్షంగా టీఆర్ఎస్ కు సహకరించటం సరికాదన్నారు.చేరికలు ఆపలేరు.
ఇక మునుగోడు ఉప ఎన్నిక నేపథ్యంలో అక్కడి నేతలను బీజేపీలో చేరకుండా పాత కేసులను ముందటేస్తూ భయపెడుతున్నారని.
బీజేపీలో చేరే నేతలపై పీడీ యాక్టు పెట్టి జైల్లో వేయాలని చూస్తున్నారని ఆరోపించారు.
ఇది చాలా దారుణమని.వేల సంఖ్యలో ఎంపీటీసీలు వందల సంఖ్యలో ఎంపీపీలు జడ్పీ ఛైర్మన్లు ఎమ్మెల్యేలు బీజేపీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారని అభిప్రాయం వ్యక్తం చేశారు.
ఎన్ని విధాలుగా భయభ్రాంతులకు గురి చేసినా బీజేపీలో చేరే నాయకులను ఆపలేరని ఈటల అన్నారు.
అధికారంలో మీరే ఎప్పటికీ ఉండరని వ్యాఖ్యానించారు.చౌటుప్పల్ ఎంపీపీ బీజేపీలో చేరగానే అర్ధరాత్రి ఇంటికి వెళ్లి పోలీసులు వేధించారని విమర్శించారు.
కేసులు పెట్టి భయపెడుతున్నారని ధ్వజమెత్తారు. """/" /
తప్పులన్నీ లెక్కపెడుతున్నాం.
ఈ సందర్భంగానే మీరు చేసిన తప్పులన్నీ లెక్కపెడుతున్నాం.తప్పకుండా ఆ లెక్కలు తేలుస్తాం.
అని హెచ్చరించారు.కూలి పని చేసుకుని జీవనం సాగించే బీజేపీ కార్యకర్తలను కూడా వదలట్లేదని.
వివిధ రకాలుగా వారిని వేధింపులకు గురి చేసి తమకు అనుకూలంగా మలుచుకోవడానికి చూస్తున్నారని అన్నారు.
ఇప్పటికైనా చిల్లర రాజకీయాలు మానుకోవాలని సీఎం కేసీఆర్ ని ఈటల రాజేందర్ హెచ్చరించారు.
‘డాకు మహారాజు’ లో బాలయ్య డ్యూయల్ రోల్ చేస్తున్నాడా..? ఒక బాలయ్య చనిపోతాడా..?