Narendra Modi : తెలంగాణ అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం..: మోదీ
TeluguStop.com
సంగారెడ్డిలో ప్రధాని నరేంద్ర మోదీ( Narendra Modi ) పర్యటన కొనసాగుతోంది.ఇందులో భాగంగా పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు.
ముందుగా సంగారెడ్డి( Sangareddy ) చౌరస్తా నుంచి మదీనాగూడ వరకు ఆరు లైన్ల రోడ్డుకు మోదీ శంకుస్థాపన చేశారు.
"""/" /
మెదక్ - ఎల్లారెడ్డి జాతీయ రహదారికి శంకుస్థాపన చేసిన మోదీ పారాదీప్ - హైదరాబాద్ గ్యాస్ పైప్ లైనును జాతికి అంకితం చేశారు.
తరువాత నాందేడ్ -అకోలా జాతీయ రహదారిని జాతికి అంకితం చేశారు.అనంతరం ప్రధాని మోదీ మాట్లాడుతూ తెలంగాణ అభివృద్ధికి( Telangana Development ) కట్టుబడి ఉన్నామన్నారు.
పదేళ్లుగా రాష్ట్ర అభివృద్ధికి ప్రయత్నిస్తూనే ఉన్నామని చెప్పారు.రాష్ట్రాల డెవలప్ మెంట్ తోనే దేశాభివృద్ధి సాధ్యమని తెలిపారు.
ఈ క్రమంలోనే మౌలిక సదుపాయాల కోసం రూ.11 లక్షల కోట్లు కేటాయించామని వెల్లడించారు.