ప్రాణాలకు తెగించి తెలంగాణను సాధించుకున్నాం..: కేసీఆర్

బీఆర్ఎస్ పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ ఖానాపూర్ లో ప్రజా ఆశీర్వాద సభలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్టీల చరిత్రను చూసి ఓటు వేయాలని తెలిపారు.

మంచి ఎమ్మెల్యే గెలిస్తేనే మంచి ప్రభుత్వం వస్తుందని కేసీఆర్ అన్నారు.మన ఓటు సద్వినియోగం అయితే మనకు మంచి భవిష్యత్ ఉంటుందని పేర్కొన్నారు.

తెలంగాణను బలవంతంగా ఏపీలో కలిపింది కాంగ్రెస్సేనని విమర్శించారు.అయితే ప్రాణాలకు తెగించి పోరాడి తెలంగాణను సాధించుకున్నామన్నారు.

అన్ని వర్గాల ప్రజల ఆత్మగౌరవాన్ని కాపాడుతున్నామన్న కేసీఆర్ దేశంలో ఎక్కడా లేని విధంగా రైతులకు 24 గంటల నాణ్యమైన విద్యుత్ అందిస్తున్నామని తెలిపారు.

కార్తీకదీపం సీక్వెల్ డొల్ల అని అభిమానులు.. మోనిత లేకపోవడమే మైనస్ అయిందా?