రెబెల్ రఘురామ.. దారెటు ?

రెబెల్ రఘురామ దారెటు ?

వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామ కృష్ణరాజు( YCP Rebel MP Raghurama Krishnaraju ) ఏపీ రాష్ట్ర రాజకీయాల్లో( AP State Politics ) ఎప్పుడు హాట్ టాపిక్ గానే నిలుస్తుంటారు.

రెబెల్ రఘురామ దారెటు ?

జగన్ పాలనపై దుమ్మెత్తిపోస్తూ, వైసీపీ నేతలపై తరచూ విమర్శలు గుప్పిస్తూ.ఆ పార్టీకి కొరకరాని కొయ్యలా రఘురామ ప్రవర్తిస్తుంటారు.

రెబెల్ రఘురామ దారెటు ?

కొన్ని సార్లు రఘురామ జగన్ పై చేసే విమర్శలు తీవ్ర స్థాయిలో ఉండడంతో తలనొప్పులు తెచ్చిపెడుతుంటాయి.

అందుకే రఘురామ నోటికి కళ్ళెం వేయాలని జగన్ ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ పెద్దగా ఉపయోగం లేకపోయింది.

దీంతో వైసీపీ ఆయనను పూర్తిగా పట్టించుకోవడమే మానేసిందనే చెప్పాలి. """/" / ఇదిలా ఉంచితే వైసీపీ రెబెల్ ఎంపీగా కొనసాగుతున్న రఘురామ.

వచ్చే ఎన్నికల్లో ఏ పార్టీ నుంచి బరిలోకి దిగుతారు ? ఆయనకు స్వాగతం పలికే పార్టీ ఏది ? అనే చర్చ ఏపీ పోలిటికల్ సర్కిల్స్ లో గత కొన్నాళ్లుగా జరుగుతూనే ఉంది.

ప్రస్తుతం ఆయన లిస్ట్ లో టీడీపీ, బీజేపీ, జనసేన.ఇలా మూడు పార్టీల పేర్లు వినిపిస్తున్నాయి.

డిల్లీలో ఉంటున్న రఘురామ నిత్యం బీజేపీ పెద్దలతో టచ్ లో ఉంటున్నారని, ఆయన బీజేపీలోనే చేరే అవకాశం ఉందనేది కొందరు చెబుతున్నా మాట.

కాదు కాదు ఆయన టీడీపీలో చేరతారనేది మరికొందరి వాదన. """/" / ఎందుకంటే ఈ మద్య ఆయన చంద్రబాబుపై సానుకూలంగా స్పందిస్తూ టీడీపీకి సపోర్ట్ గా నిలుస్తున్నారు.

ఇంకోసైడ్ ఏమో జనసేన పార్టీ పై పవన్ పై కూడా రఘురామ సానుకూలంగానే స్పందిస్తూ వస్తున్నారు.

దీంతో ఆయన జనసేన గూటికి చేరే అవకాశం కూడా లేకపోలేదు అనే వార్తలు కూడా వినిపించాయి.

ఇలా మూడు పార్టీల చుట్టూ తిరుగుతున్న రఘురామ.చివరికి ఏ పార్టీలో చేరతారనే క్లారిటీ ఇంతవరకు లేదు.

అయితే ప్రస్తుతం వినిపిస్తున్న సమాచారం ప్రకారం.ఆయన టీడీపీ గూటికి చేరే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయట.

ఇప్పటికే చంద్రబాబు నర్సాపురం ఎంపీ టికెట్ కూడా రఘురామ కోసం కేటాయించినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి.

ఇదే గనుక నిజం అయితే త్వరలోనే రఘురామ పసుపు కండువా కప్పుకునే అవకాశం ఉంది.

మరి రఘురామ దారెటో చూడాలి.

ఇకపై ఆదివారాలు పెట్రోల్ బంకులు పనిచేయవా? నిజమెంత?