ఈ మధ్య కాలంలో సంతాన సమస్యలతో సతమతమవుతున్న దంపతులు ఎందరో ఉన్నారు.పెళ్లై ఎన్ని ఏళ్లు గడుస్తున్నా.
పిల్లలు కలగకుంటే బాధ, భయం, తెలియని ఆందోళన, ఎదుట వారి సూటిపోటి మాటలతో నానా ఇబ్బందులు పడతారు.
అయితే సంతాన సమస్యలు ఎదుర్కోవడానికి కేవలం ఆడవారే కారణం అనుకోవడం పొరపాటు.మగవారిలో ఉండే లోపాలు కూడా పిల్లలు పుట్టకపోవడానికి కారణం కావొచ్చు.
అందుకే దంపతులిద్దరూ సరైన జాగ్రత్తలు తీసుకోవాలి.అయితే కొన్ని కొన్ని ఆహారాలు సంతాన సమస్యలను నివారించడంలో అద్భుతంగా సహాయపడతాయి.
అలాంటి వాటిలో పుచ్చ గింజులు కూడా ఉన్నాయి.పుచ్చకాయ మాదిరిగానే పుచ్చ గింజల్లో కూడా మెగ్నీషియం, ఐరన్, పొటాషియం, జింక్, మాంగనీస్, పాస్పరస్, కాపర్, విటమిన్ బి, ఫైబర్, ప్రోటీన్, యాంటీ ఆక్సిడెంట్స్ ఇలా బోలెడన్ని పోషకాలు నిండి ఉంటాయి.
అందుకే చాలా మంది పుచ్చ గింజలను కొనుక్కుని మరీ తింటారు. """/"/
అయితే ముఖ్యంగా సంతాన సమస్యలతో బాధ పడే వారికి పుచ్చ గింజలు ఎంతగానో ఉపయోగపడతాయి.
పుచ్చ గింజలను ఎండ బెట్టి పొడి చేసుకోవాలి.ఇప్పుడు ఒక గ్లాస్ వాటర్‌లో పుచ్చ గింజల పొడి వేసి మరిగించి వడబోసుకోవాలి.
ఇప్పుడు ఈ వాటర్‌లో తేనె వేసి మిక్స్ చేసుకుని సేవించాలి.ఈ వాటర్‌ను ప్రతి రోజు ఒక కప్పు చప్పున దంపతులిద్దరూ తీసుకోవాలి.
ఇలా చేస్తే పుచ్చ గింజల్లో ఉండే పలు పోషకాలు.స్త్రీలో గర్భాశయ సమస్యలు దూరం చేస్తాయి.
అలాగే పురుషుల్లో వీర్యకణాల సంఖ్య, నాణ్యతను పెంచుతాయి.లైంగిక సామర్థం కూడా రెట్టింపు అవుతుంది.
అంతేకాదు, స్త్రీ, పురుషుల్లో హార్మోన్ల ఉత్పత్తిని పెంచి సంతానోత్పత్తి అవకాశాలను పెంచే సామర్థం పుచ్చ గింజలకు ఉంది.
కాబట్టి, పుచ్చ గింజల వాటర్ తీసుకోవడం ఎంతో మంచిది.