సూర్యాపేట జిల్లా:ఎన్నికల నేపథ్యంలో ప్రజా ప్రతినిధులు,అధికారులు ప్రజా సమస్యలపై దృష్టి పెట్టకపోవడంతో గ్రామాల్లో తాగునీటి కొరతతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
వేసవి రాకుండానే గ్రామాల్లో, తండాలో మంచినీటి కొరత వేధిస్తోందని సూర్యాపేట జిల్లా పాలకవీడు మండలం చెరువుతండా గిరిజనులు మంచినీటి కోసం జాన్ పహాడ్ ప్రధాన రహదారిపై ఖాళీ బిందెలతో రాస్తారోకో చేపట్టిన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లడుతూ గత 15 రోజుల నుండి మిషన్ భగీరథ నీళ్ళు రావడం లేదన్నారు.
తక్షణమే అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి గ్రామంలో తాగునీటి సమస్యను తీర్చాలని డిమాండ్ చేశారు.
నేను చచ్చిపోతా… నా బిడ్డలను కాపాడండి…పవన్ మాజీ భార్య సంచలన వ్యాఖ్యలు!