విశాఖ కాకాణినగరంలో వాచ్‎మన్ హల్‎చల్

విశాఖపట్నం జిల్లాలోని కాకాణినగరంలో వాచ్‎మన్ హల్‎చల్ చేశాడు.వాచ్‎మన్ నిర్వాకంపై అపార్ట్ మెంట్ వాసులు డయల్ 100కు ఫిర్యాదు చేశారు.

ఈ క్రమంలో కంప్లైంట్ మేరకు అపార్ట్ మెంట్ కు వెళ్లిన ఇద్దరు కానిస్టేబుళ్లపై వాచ్‎మన్ విచక్షణారహితంగా దాడి చేశాడు.

ఈ ఘటనలో ఇద్దరు కానిస్టేబుళ్లకు తీవ్ర గాయాలు కావడంతో స్థానికులు ఆస్పత్రికి తరలించారు.

కాగా వీరిలో ఓ కానిస్టేబుల్ పరిస్థితి విషమంగా ఉందని తెలుస్తోంది.అయితే వాచ్‎మన్ మద్యం మత్తులో పోలీసులపై దాడి చేశాడని సమాచారం.

ఘటనపై కేసు నమోదు చేసిన అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.

అబ్బో, ఎంత మర్యాదో: జంటకు ఇబ్బంది కలగకూడదని వేచి ఉన్న పెంగ్విన్.. వీడియో వైరల్!