వైరల్: ‘బుర్జ్ అల్ అరబ్’ బిల్డింగ్‌పై ల్యాండ్ అయిన విమానం… ఇదే ఫస్ట్ టైం అట!

యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ దేశంలోని 7 ఎమిరేట్స్ లలో దుబాయ్ ( Dubai ) ఒకటి.

దుబాయ్ సిటీగా పిలిచే ఇది దేశంలోనే అభివృద్ధి చెందిన పట్టణం.దుబాయ్ ఆంధ్రులకు బాగా సుపరిచితమైన పట్టణం అని చెప్పుకోవచ్చు.

ఇక్కడ అత్యదికంగా వలస ఆంధ్రులు వుంటారు.ఇక ఆకాశహర్మ్యాలకు దుబాయ్ పెట్టింది పేరు.

ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన బుర్జ్ ఖలిఫా బిల్డింగ్ ఇక్కడే వుంది.అయితే దుబాయ్‌లోనే మరో ఎత్తైన బిల్డింగ్ వుంది, దానిపేరే 'బుర్జ్ అల్ అరబ్.

'( Burj Al Arab ) ఇక దీని ఎత్తు 280 మీటర్లు అంటే 920 అడుగులన్నమాట.

"""/" / ఇంత ఎత్తైన బిల్డింగులపై హెలికాప్టర్లు ల్యాండ్ అవడం మనం చూస్తూ ఉంటాం.

ఇలాంటి దృశ్యాలు మీరు సినిమాలలోని కూడా చూసుంటారు.అయితే విమానాలు ల్యాండ్ అవ్వడం ఎపుడైనా చూసారా? దాదాపుగా చూసి వుండరు.

ఎందుకంటే అది వీలు కాదు.కానీ, బుర్జ్ అల్ అరబ్ బిల్డింగ్‌పై తాజాగా ఒక విమానం ల్యాండ్ అయి చరిత్ర సృష్టించింది.

అవును, దీనిపై విమానం ల్యాండ్ కావడం ఇదే మొదటిసారి మరి. """/" / పోలాండ్‌కు చెందిన ఎయిర్ రేస్ చాలెంజర్ క్లాస్ వరల్డ్ ఛాంపియన్ అయిన ల్యుక్ సెపిలా( Luke Czepiela ) ఈ అరుదైన ఘనత సాధించి రికార్డుల్లోకి ఎక్కాడు.

బిల్డింగ్‌పై నిర్మించిన హెలిప్యాడ్‌పై విమానాన్ని సక్సెస్‌ఫుల్‌గా ల్యాండ్ చేసి అందరినీ ఆశ్చర్య పరిచాడు.

బుర్జ్ అల్ అరబ్ హోటల్ హెలిప్యాడ్‌పై ప్రత్యేకంగా తయారు చేసిన విమానాన్ని ల్యూక్ ల్యాండ్ చేశాడు.

ఈ హెలిప్యాడ్ 27 మీటర్ల వైశాల్యం కలిగి ఉంటుంది.ఇంత తక్కువ స్థలం ఉన్న చోట విమానం ల్యాండ్ చేయడం కష్టం.

అయినప్పటికీ ల్యూక్ దీన్ని విజయవంతంగా పూర్తి చేయడం వెనుక గల కారణాలను నిపుణులు వెతుక్కొని పనిలో పడ్డారు.

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – ఆగస్ట్16, శుక్రవారం