బుగట్టి సూపర్‌కార్ ఇంజిన్‌తో తయారైన వాచ్ ఎలా పనిచేస్తుందో తెలిస్తే షాక్ అవుతారు!
TeluguStop.com

ప్రసిద్ధ స్విస్ వాచ్‌మేకర్ జాకబ్ అండ్ కో తాజాగా బుగట్టి చిరోన్ బ్లూ సఫైర్ క్రిస్టల్ టైమ్‌పీస్‌ను పరిచయం చేసింది.


ఈ వాచ్‌లో.ప్రపంచంలోని అత్యంత ఖరీదైన సూపర్‌కార్లలో ఉండే బుగట్టి చిరోన్ ఇంజిన్‌ను అమర్చారు.


ఈ గడియారానికి సంబంధించిన అనేక ఆసక్తికరమైన విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.ఫోర్బ్స్ తెలిపిన వివరాల ప్రకారం ఈ వాచ్ పారదర్శకంగా ఉంటుంది.
బుగట్టి చిరోన్ డబ్ల్యు16 ఇంజన్ వాచ్ ఆకారానికి అనుగుణంగా రూపొందించారు.ఈ వాచీని ధరించిన తర్వాత ఇంజిన్‌లోని మోటారును యాక్టివేట్ చేయవచ్చు.
పారదర్శకంగా ఉండడం వల్ల అందులో కదలిక కూడా కనిపిస్తుంది.జాకబ్ అండ్ కంపెనీ బుగట్టితో కలిసి ఈ వాచ్‌ని తయారు చేసింది.
అందులో ఒక బటన్ ఉంటుంది.అది నొక్కిన వెంటనే, దానిలోని ఇంజిన్ స్టార్ట్ అవుతుంది.
578 భాగాలను అనుసంధానం చేస్తూ ఈ వాచ్‌ను తయారు చేశారు.ఇది ఈ కోవలోని ప్రత్యేకమైన వాచ్ అని కంపెనీ తెలిపింది.
వాచ్ బ్లూ కలర్ కేస్‌తో తీర్చిదిద్దారు.ఈ వాచ్ ఖరీదు రూ.
ఈ గడియారం సాటిలేని సాంకేతిక మేళవింపుతో కూడివుంది.దీని గురించి జాకబ్ అండ్ కంపెనీ సీఈవో బెంజమిన్ అరబోవ్ మాట్లాడుతూ.
తాము ఎప్పటి నుంచో లగ్జరీ వాచ్‌ని రూపొందించాలనుకుంటున్నామని, బుగట్టి చిరాన్ టూర్‌బిలియన్ టైమ్‌పీస్‌తో అది సాకారమయ్యిందన్నారు.
ఇది మణికట్టుపై ధరించగలిగే ప్రపంచంలోని మొట్టమొదటి ట్రూ ఇంజిన్ అని పేర్కొన్నారు.
వార్టన్ స్కూల్‌లో భారత సంతతి ఎగ్జిక్యూటివ్‌కు కీలకపదవి!