వైరల్: రూపాయి ఖర్చు లేకుండా కారును శుభ్రం చేస్తున్న డ్రైవర్.. చూసి నేర్చుకోండి!

మనలో చాలామంది దాదాపు ఒకే ఆలోచనతో మూసధోరణతో జీవించేస్తూ ఉంటారు.కానీ అరుదుగా కొంతమంది మాత్రం వారి తెలివిని వినియోగిస్తూ చాలా స్పెషల్ గా జీవిస్తూ ఉంటారు.

అలాంటివారే నూతన ఆవిష్కరణలకు శ్రీకారం చుడుతూ ఉంటారు.ఇపుడు దేశంలో మనం చెప్పుకోదగ్గ పెద్దవాళ్ళు అందరూ అలా ఆలోచించినవారే.

ఇక ఈ సోషల్ మీడియా యుగంలో కొందరు తమ తెలివితేటలకు పదును పెట్టి ఏవేవో ప్రయోగాలు చేస్తూ నెటిజన్ల దృష్టిని ఆకర్షిస్తూ ఉన్నారు.

ఇలాంటి వీడియోలను చూసినప్పుడు.‘‘వీరికి ఇలాంటి ఐడియాలు ఎలా వస్తాయి’’ అని అనిపించకమానదు.

ఈ తరహా ఘటనలకు సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. """/" / విషయం ఏమిటంటే, ఓ వ్యక్తి రూపాయి కూడా ఖర్చు చేయకుండా తన కారును శుభ్రం చేసిన విధానం చూసి నెటిజన్లు అవాక్కవుతున్నారు.

వీడియోని ఒకసారి పరిశీలిస్తే.ఓ వ్యక్తి కారులో వెళ్తుండగా దారి మధ్యలో ఎదరుగా ఓ నీళ్ల ట్యాంకర్( Water Tanker ) వెళ్తుంటుంది.

అది రోడ్డు పక్కన మొక్కలకు నీళ్లు స్ప్రే చేస్తూ వెళ్తుంటుంది.నీళ్ల ట్యాంకర్‌ను చూడగానే కారు డ్రైవర్ బుర్రలో( Driver's Seat ) సూపర్ ఐడియా వెలుగుతుంది.

వెంటనే తన కారును నేరుగా నీళ్ల కిందకు తీసుకెళ్తాడు.దాంతో నీళ్లు వేగంగా స్ప్రే కొట్టడంతో కారుకు ఓ వైపు మొత్తం శుభ్రం అవుతుంది.

తర్వాత వేగంగా ముందుకు వెళ్లి.ట్యాంకర్ అవతలి వైపుకి వెళ్తాడు.

ఆ తర్వాత రెండు వైపు కూడా శుభ్రం అయ్యేలా చేస్తాడు.ఇలా నీళ్ల ట్యాంకర్‌కు అటూ, ఇటూ తిరుగుతూ కారును మొత్తం క్లీన్ చేసేస్తాడు.

"""/" / కాగా ఈ దృశ్యం చూసిన నెటిజన్లు అవాక్కవుతూ.అరె ఇలాంటి ఐడియాలు మనకి రావేంటి? అని అనుకొని వీడియో తీసి, సోషల్ మీడియాలో షేర్ చేయగా ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది.

దాంతో దీనిపై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు.‘‘ఈ కారు డ్రైవర్ తెలివితేటలు మామూలుగా లేవు’’ అని కొంతమంది కామెంట్స్ చేస్తే, ‘‘ఎలా వస్తాయో.

ఇలాంటి ఐడియాలు’’.అంటూ మరికొందరు, రూపాయి ఖర్చు లేకుండా బలే వాడేసాడు నీటిని అంటూ మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు.

కాగా ఈ వీడియో ప్రస్తుతం 600కి పైగా లైక్‌లు, 99 వేలకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకొని సోషల్ మీడియాలో ట్రెండింగులో ఉంది!.

జలుబు, దగ్గు నుంచి మైగ్రేన్ వరకు వాము తో ఎన్ని సమస్యలకు చెక్ పెట్టవచ్చో తెలుసా?