ధరణిలో పోడు భూములను నమోదు చేయాలి..: భట్టి

తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా రాష్ట్ర ఏర్పాటుతో పాటు స్వరాష్ట్రంలో సాధించిన ప్రగతిపై చర్చ జరిగింది.

ఈ క్రమంలో ప్రతిపక్ష సభ్యులు, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క మాట్లాడుతూ ఐటీడీఏలను నిర్వీర్యం చేశారని మండిపడ్డారు.

పోడు భూములను ధరణిలో నమోదు చేయడం లేదని ఆరోపించారు.తొమ్మిది సంవత్సరాలు దాటుతున్నా గిరిజనులకు న్యాయం జరగడం లేదన్నారు.

గిరిజనుల భూములను ట్రాక్టర్లతో ధ్వంసం చేస్తున్నారని దుయ్యబట్టారు.ఈ క్రమంలోనే అసైన్ చేసిన భూములు గిరిజనులకే ఉండేలా చూడాలని కోరారు.

ధరణిలో పోడు భూములను నమోదు చేయాలని భట్టి డిమాండ్ చేశారు.

ఖతార్ ఆధీనంలో గురు గ్రంథ్ సాహిబ్ స్వరూప్స్.. జోక్యం చేసుకోండి , జైశంకర్‌కు బీజేపీ నేత లేఖ