కొట్టుకుపోయిన గుండ్ల‌క‌మ్మ ప్రాజెక్టు గేటు.. వృథాగా పోతున్న నీరు

ప్రకాశం జిల్లాలోని గుండ్ల‌క‌మ్మ ప్రాజెక్టు గేటు కొట్టుకుపోయింది.దీంతో నీరు వృథాగా పోతుంది.

స్టాప్ లాక్ ద్వారా నీటిని ఆపేందుకు ఇంజ‌నీర్లు చేసిన ప్ర‌య‌త్నం ఫ‌లించ‌లేదు.దీంతో 13, 14, 15 గేట్లు ఎత్తి ప్రాజెక్టులో నీటి ఒత్తిడిని త‌గ్గిస్తున్నారు.

ఇప్పటికే 12వేల క్యుసెక్కుల నీరు సముద్రం పాలైంది.ప్రాజెక్టులో నీటి మట్టం తగ్గడంతో రైతులు, మత్స్యకారులు ఆందోళన చెందుతున్నారు.

అధికారుల ప‌ర్య‌వేక్ష‌ణ లోపం, సరైన మ‌ర‌మ్మ‌తులు చేప‌ట్ట‌క‌పోవ‌డంతోనే గుండ్ల‌కమ్మ ప్రాజెక్టు మూడ‌వ గేటు విరిగిపోయింద‌నే విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్నాయి.

ఈ న్యాచురల్ నైట్ క్రీమ్ తో మీ స్కిన్ అవుతుంది సూపర్ గ్లో..!