Varun Lavanya: ఆ హీరోయిన్ రిజెక్ట్ చేయడం వల్లే వరుణ్ తేజ్ లావణ్యల పెళ్లి జరిగిందా..?
TeluguStop.com
అందాల రాక్షసి సినిమా(Andala Rakshasi Movie) తో అందరి మనసులు కొల్లగొట్టిన నటి లావణ్య త్రిపాఠి(Lavanya Tripathi) ఎట్టకేలకు మెగా ఇంటికి కోడలు అయిపోయింది.
మిస్టర్ సినిమా సమయంలో వరుణ్ తేజ్ (Varun Tej) లావణ్య త్రిపాఠిల మధ్య ఏర్పడిన స్నేహబంధం కాస్త ప్రేమబంధంగా మారి దాదాపు చాలా రోజులు వీరిద్దరూ సీక్రెట్ గా వారి రిలేషన్ ని బయటకి రాకుండా మెయింటైన్ చేసి చివరికి 2023 నవంబర్ 1న వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి లు పెళ్లి చేసుకున్నారు.
ఇక వీరి పెళ్లి ఇటలీలో గ్రాండ్ గా జరిగింది.అయితే పెళ్లికి చాలా తక్కువ మంది అతిథులను ఆహ్వానించినప్పటికీ రిసెప్షన్ పార్టీని మాత్రం హైదరాబాదులో చాలా గ్రాండ్ గా నిర్వహించారు నాగబాబు.
ప్రస్తుతం వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి హనీమూన్ ని ఎంజాయ్ చేస్తున్నారు.ఇదంతా పక్కన పెడితే వరుణ్ తేజ్ లావణ్య ల పెళ్లి జరగడానికి ప్రధాన కారణం ఆ హీరోయిన్ రిజెక్ట్ చేయడమే అంటూ తాజాగా నెట్టింట్లో ఒక వార్త చక్కర్లు కొడుతుంది.
విషయంలోకి వెళ్తే.వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి లు మిస్టర్ సినిమా (Mister Movie) సమయంలోనే ప్రేమలో పడ్డారు అంటూ ఓ సీక్రెట్ ని బయటపెట్టారు.
"""/" /
అయితే ఈ సినిమాలో లావణ్య త్రిపాఠి తో పాటు హెబ్బా పటేల్(Hebah Patel) కూడా నటించింది.
అయితే ఈ సినిమాలో లావణ్య త్రిపాఠి పాత్రలో ముందుగా మరో హీరోయిన్ ని అనుకున్నారట.
ఆ హీరోయిన్ రిజెక్ట్ చేయడంతో ఈ పాత్ర లావణ్య త్రిపాఠి కి వచ్చిందట.
ఇక ఆ హీరోయిన్ ఎవరో కాదు సమంత.మిస్టర్ సినిమాలో వరుణ్ తేజ్ సరసన ముందుగా సమంతకే అవకాశం వచ్చిందట.
"""/" /
కానీ సమంతకి ఈ స్టోరీ నచ్చక పోవడంతో ఈ సినిమాని రిజెక్ట్ చేసిందట.
అలా సమంత (Samantha) ప్లేస్ లో లావణ్య త్రిపాఠిని తీసుకున్నారు.దాంతో లావణ్య త్రిపాఠి వరుణ్ తేజ్ లు ఈ సినిమా సమయంలోనే ప్రేమలో పడ్డారు.
అలా పరోక్షంగా లావణ్య త్రిపాఠి వరుణ్ తేజ్ లు ప్రేమించుకొని,పెళ్లి జరగడానికి సమంత కారణమయ్యారు.
చెన్నైలో విదేశీ విద్యార్థినిపై ఆటో డ్రైవర్ దారుణం.. ‘అది చీరేస్తా’ అంటూ అసభ్య బెదిరింపులు!