వంశీ సారీ చెప్ప‌డం వెన‌క పెద్ద క‌థే న‌డిచిందా..?

ఏపీ రాజ‌కీయాల‌ను ఓ కుదుపు కుదిపేసిన ఘ‌ట‌న మొన్న అసెంబ్లీ సాక్షిగా చోటుచేసుకుంది.

ఈ ఘ‌ట‌న‌లో రాజ‌కీయాల్లో సుదీర్ఘ కాలం ఒక పార్టీకి అధినేత‌గా ప‌నిచేస్తున్న చంద్ర‌బాబు క‌న్నీళ్లు పెట్టుకున్నారు.

ఈ ఘ‌ట‌న దేశ‌వ్యాప‌ప్తంగా తీవ్ర చ‌ర్చ‌నీయాంశంగా మారింది.జాతీయ మీడియాలో కూడా ఇదే హైలెట్ కావ‌డంతో అంద‌రూ దీని గురించే చ‌ర్చించుకున్నారు.

దీంతో అటు సోష‌ల్ మీడియాలో ఇటు ప్ర‌జ‌ల్లో కూడా వైసీపీ మీద తీవ్ర స్థాయిలో విమ‌ర్శ‌లు వ‌చ్చాయి.

అసెంబ్లీలో స‌మ‌స్య‌ల గురించి చ‌ర్చించుకోవాలి గానీ ఇలాంటి అవ‌మానాలు ఏంటంటూ అన్ని వైపులా విమ‌ర్శ‌లు వ‌చ్చాయి.

ముఖ్యంగా చంద్రబాబు సతీమణి భువనేశ్వరి విష‌యంలో వైసీపీ ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్య‌లు అత్యంత బాధాక‌ర‌మంటూ దేశ వ్యాప్తంగా చంద్ర‌బాబుకు సింపతీ పెరిగింది.

పైగా చంద్ర‌బాబు కూడా ఈ ఘ‌ట‌న‌మీద క‌న్నీళ్లు పెట్టుకోవ‌డంతో ఎన్న‌డూ స్పందించ‌ని నంద‌మూరి కుటుంబం కూడా చంద్ర‌బాబుకు మ‌ద్ద‌తుగా నిల‌బ‌డింది.

ఇలా న‌లువైపులా విమ‌ర్శ‌లు రావ‌డంతో జ‌గ‌న్ కూడా దీనిపై కొంచెం సీరియ‌స్ అయిన‌ట్టు తెలుస్తోంది.

పార్టీమీద విమ‌ర్శ‌లు రావ‌డంతో జ‌గ‌న్ ఈ విష‌యం మీద కాస్త గ‌ట్టిగానే న‌జ‌ర్ పెట్టారంట‌.

కాబ‌ట్టి పార్టీ ప‌రంగా దీనిమీద చ‌ర్చ‌లు కూడా జ‌రిపారంట‌. """/"/ దీన్ని వ్య‌క్తిగ‌తంగా ఒక వ్య‌క్తికే ప‌రిమితం చేయాల‌ని, పార్టీని ఇందులోకి లాగొద్దంటూ సూచించారంట జ‌గ‌న్‌.

ఈ నేప‌థ్యంలోనే వంశీ తాను చేసిన వ్యాఖ్యల మీద దిగి వ‌చ్చారు.భువనేశ్వరి మీద పొరపాటున అలాంటి కామెంట్లు చేశాన‌ని, అందుకు క్ష‌మాప‌ణ‌లు కోరుతున్న‌ట్టు చెప్పారు.

తాను భువ‌నేశ్వ‌రిని అక్కా అని పిలిచేవాడిన‌ని, ఆమె మీద చేసిన వ్యాఖ్య‌ల‌కు సారీ చెబుతున్న‌ట్టు వెల్ల‌డించారు.

ఇక చంద్ర‌బాబుకు కూడా క్ష‌మాప‌ణ‌లు చెప్పారు.త‌న నుంచి ఇంకోసారి ఇలాంటి వ్యాఖ్య‌లు రావంటూ చెప్పుకొచ్చారు.

దీన్ని ఇక్క‌డితో ఆపేయాలంటూ కోరారు.మ‌రి ఈ వివాదం ఇక్క‌డితో ముగిసిపోతుందో లేదో చూడాలి.

కూటమి పార్టీల్లో క్రాస్ ఓటింగ్ భయం ?