ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో రేవంత్ ఒంటరిపోయాడా?

తెలంగాణలో దుబ్బాక ఎన్నికల తరువాత నుండి మొదలుకొని వరుసపెట్టి ఎన్నికలు జరుగుతున్నాయి.దుబ్బాక ఉప ఎన్నిక తరువాత గ్రేటర్ ఎన్నికలు, త్వరలో నాగార్జునసాగర్ ఉప ఎన్నిక, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు ఇలా ఎన్నికలు జరగనున్నాయి.

అయితే దుబ్బాక, గ్రేటర్ ఎన్నికల్లో అధికార పక్షానికి కొంత ఎదురుదెబ్బ తగిలినా మరల ఈ ఎన్నికల్లో అటువంటి పరిస్థితి పునరావృతం కాకుండా జాగ్రత్తపడుతోంది.

ఇక బీజేపీ విషయానికొస్తే ప్రతి ఎన్నికల్లో సత్తా చాటాలని బీజేపీ ప్రయత్నిస్తోంది.ఇక కాంగ్రెస్ విషయానికొస్తే కాంగ్రెస్ లో ఏ ఎన్నికలు జరిగినా నాయకుల మధ్య ఐకమత్యం లేకపోవడం అన్నది మనకు ప్రతి సారి కనిపించే పరిస్థితే.

అయితే కాంగ్రెస్ లో ఎన్ని కుమ్ములాటలున్నా రేవంత్ రెడ్డి కాంగ్రెస్ గాడిన పడేయడానికి తన శక్తికి మించి ప్రయత్నిస్తున్నాడు.

ఇటీవల రాజీవ్ రైతు భరోసా పేరిట పాదయాత్ర చేపట్టి రైతులకు, సామాన్య ప్రజలకు కాంగ్రెస్ పార్టీ తరపున భరోసా ఇచ్చిన పరిస్థితి ఉంది.

ఐతే త్వరలో ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనున్న తరుణంలో ఎవరికి వారు గట్టిగా ప్రచారం చేస్తున్న సమయంలో జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్ పార్టీ నిమ్మకు నీరెత్తకుండా వ్యవహరిస్తూ ఎవరికి వారే యమునా తీరే అన్నట్లుగా కాంగ్రెస్ నాయకులు వ్యవహరించడం కాంగ్రెస్ కు నష్టం కలిగే అవకాశం చాలా ఉంది.

పార్టీ కి ఎన్ని నష్టాలు జరిగినా పార్టీ కన్నా, వ్యక్తిగత ఎజెండాకు ప్రాధాన్యమిస్తే వచ్చే ఎన్నికల్లో కనీసం గట్టి పోటీ కూడా ఇవ్వలేకపోతే ఇక కాంగ్రెస్ ను నిలబెట్టాలంటే కాంగ్రెస్ నాయకులు చాలా కష్టపడాల్సి ఉంటుంది.

కల్కి సినిమా లో ఆ సీన్ హైలెట్ కానుందా..?