శాకుంతలం సినిమాలో మొదటిగా అనుకున్న హీరో దేవ్ మోహన్ కాదా… మరి ఎవరంటే?
TeluguStop.com
టాలీవుడ్ ఇండస్ట్రీలో క్రేజీ హీరోయిన్ గా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నటువంటి వారిలో నటి సమంత(Samantha) ఒకరు.
ఇలా ఇండస్ట్రీలో ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి ఈమె ప్రస్తుతం వివిధ భాషలలో సినిమా అవకాశాలను అందుకొని బిజీగా ఉన్నారు ఇకపోతే సమంత గుణశేఖర్( Gunashekar ) దర్శకత్వంలో నటించిన మొట్టమొదటి పౌరాణిక చిత్రం శాకుంతలం( Shaakuntalam ).
ఈ సినిమాలో సమంత శకుంతల పాత్రలో నటించగా దుష్యంతుడి పాత్రలో దేవ్( Dev Mohan ) మోహన్ నటించారు.
ఇప్పటికే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉండగా కొన్ని కారణాల వల్ల వాయిదా పడుతూ వస్తుంది.
"""/" /
ఇకపోతే ఈ చిత్రాన్ని వచ్చే నెల 14వ తేదీ విడుదల చేయడానికి చిత్ర బృందం అన్ని ఏర్పాట్లు చేశారు.
ఈ క్రమంలోనే చిత్ర బృందం మొత్తం ప్రస్తుతం ప్రమోషన్ కార్యక్రమాలలో బిజీగా ఉన్నారు.
ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా నార్త్ ఇండస్ట్రీలో ప్రమోషన్ కార్యక్రమాలను వేగవంతం చేశారు.
ఇకపోతే ఈ కార్యక్రమాలలో భాగంగా డైరెక్టర్ గుణశేఖర్ మాట్లాడుతూ ఈ సినిమా గురించి పలు ఆసక్తికరమైన విషయాలను తెలియచేశారు ఈ సందర్భంగా గుణశేఖర్ మాట్లాడుతూ ఈ సినిమాలో ముందుగా దుష్యంతుడి పాత్రలో నటించడం కోసం దేవ్ మోహన్ ని తాము సంప్రదించలేదని తెలిపారు.
</br """/" /
ఈ సినిమాలోని దుష్యంతుడి పాత్రలో నటించడం కోసం ముందుగా మలయాల నటుడు దుల్కర్ సల్మాన్ ను తీసుకోవాలని భావించాము.
అయితే అప్పటికే దుల్కర్ సీతారామం( Sitaramam ) సినిమాకు కమిట్ అయ్యారు.తద్వారా ఈ సినిమాలో దుష్యంతుడి పాత్ర కోసం దుల్కర్ సల్మాన్( Dulquer Salmaan ) ను కాదని దేవ్ మోహన్ దేవ్ మోహన్ ను తీసుకున్నామంటూ ఈ సందర్భంగా గుణశేఖర్ వెల్లడించారు.
ఇక ఈ సినిమాలో తెలుగు హీరోలను తీసుకోకపోవడానికి ఓ కారణము ఉందని తెలుస్తుంది.
సాధారణంగా హీరోయిన్ ప్రాధాన్యత ఉన్న సినిమాలలో నటించడానికి ఏ హీరోలు కూడా ముందుకురారు.
అందుకే ఈ సినిమాలో తెలుగు హీరోలను కాకుండా పరభాష హీరోలను తీసుకున్నట్లు తెలిపారు.