యూజర్లకు హెచ్చరిక.. ఆ యాప్ ద్వారా సైబర్ ఎటాక్

క్రెడిట్ కార్డ్‌కు ప్రత్యామ్నాయంగా చెప్పుకునే అనేక ఫిన్‌టెక్ కంపెనీలలో స్లైస్ ఒకటి.చెల్లింపుల యాప్ యూజర్ల ఫోటోలు, కాల్ లాగ్‌లు, ఇతర వ్యక్తిగత వివరాలను గూఢచర్యం చేయడానికి ప్రయత్నిస్తోందని గూగుల్ హెచ్చరించింది.

దీంతో స్లైస్ అధికారిక ప్రకటనను విడుదల చేసింది.అన్ని సమస్యలను పరిష్కరించినట్లు తెలిపింది.

యాప్‌ను అత్యవసరంగా తాజా వెర్షన్‌కి అప్‌డేట్ చేసుకోవాలని వినియోగదారులకు సూచించింది.అయితే ఈ యాప్ యూజర్ల భద్రతకు భంగం కలిగిస్తుందని, ఈ యాప్ వాడే వారు సైబర్ ఎటాక్‌కు గురవుతారని హెచ్చరిస్తోంది.

దీనికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.గూగుల్ తన రొటీన్ ప్లే ప్రొటెక్ట్ స్కాన్‌ని నిర్వహించిన తర్వాత స్లైస్ యాప్‌ యూజర్‌లకు హెచ్చరికలు పంపింది.

స్కాన్ సమయంలో వినియోగదారుల వ్యక్తిగత డేటాను దొంగిలించడానికి ప్రయత్నిస్తున్నందున స్లైస్ చెల్లింపుల యాప్ "హానికరమైనది"గా గుర్తించింది.

స్లైస్ యాప్ మీ డివైజ్‌ను ప్రమాదంలో పడేస్తుంది అంటూ యూజర్లకు నోటిఫికేషన్‌ను కూడా పంపింది.

మెసేజ్‌లు, ఫోటోలు, ఆడియో రికార్డింగ్‌లు, కాల్ హిస్టరీ వంటి వ్యక్తిగత డేటాపై గూఢచర్యం చేయడానికి ప్రయత్నించే హానికరమైన యాప్ స్లైస్ అని గూగుల్ పేర్కొంది.

యూజర్లు ఈ అప్లికేషన్‌ను అన్‌ఇన్‌స్టాల్ చేయమని సిఫార్సు చేసింది.ఒక్క గూగుల్ ప్లే స్టోర్‌లోనే స్లైస్ 10 మిలియన్లకు పైగా ఇన్‌స్టాల్‌లను కలిగి ఉంది.

ఇది యాపిల్ యాప్ స్టోర్‌లో ఐఓఎస్ వినియోగదారులకు కూడా అందుబాటులో ఉంది.దీంతో స్లైస్ అప్రమత్తమైంది.

తమ యాప్‌లో ఉండే భద్రతా లోపాలను సవరించామని, వెంటనే తాజా వెర్షన్‌కు అప్‌‌డేట్ అవ్వాలని సూచించింది.

ఏపీ అభివృద్ధే ఎన్డీఏ లక్ష్యం..: ప్రధాని మోదీ