శాంతినగర్ ఇంటిగ్రేటెడ్ హాస్టల్లో వార్డెన్ నిర్లక్ష్యం విద్యార్ది మృతి
TeluguStop.com
సూర్యాపేట జిల్లా: సమీకృత బాలుర వసతి గృహంలో విద్యార్థులను కంటికి రెప్పలా కాపాడాల్సిన సిబ్బంది పర్యవేక్షణ లోపంతో ఓ విద్యార్థి నిండు ప్రాణం బలైన సంఘటన సూర్యాపేట జిల్లాలో వెలుగులోకి వచ్చింది.
కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.సూర్యాపేట జిల్లా అనంతగిరి మండలం శాంతినగర్ గ్రామంలోని సమీకృత ఎస్సీ,ఎస్టీ,బీసీ వసతి గృహం ట్యూటర్ బత్తుని వీరబాబు ఆదివారం ఇద్దరు హాస్టల్ విద్యార్థులను తన వ్యవసాయ పనుల నిమిత్తం టేకు చెట్లు నరికేందుకు తీసుకెళ్లాడు.
చెట్లు కొట్టాక అక్కడే ఉన్న బావిలో ఈత కొట్టేందుకు ట్యూటర్ తో పాటు పదో తరగతి చదువుతున్న చింతలపాలెం మండలం నక్కగూడేనికి చెందిన విద్యార్థి గూగులొత్ తిరుమలేష్ (15) బావిలోకి దూకాడు.
ఈత రాదని మృతుడు తిరుమలేష్ చెప్పినప్పటికీ నేనున్నాను,నీకేం భయం లేదని బావిలోకి దూకమని చెప్పడంతో విద్యార్థి బావిలోకి దూకాడు.
కాగా ట్యూటర్ బావి నుంచి బయటకు వచ్చినప్పటికీ విద్యార్థి బయటకు రాకపోవడం గమనించిన ట్యూటర్ బత్తిని వీరబాబుతో పాటు మరో విద్యార్థి సమాచారాన్ని గ్రామస్థులకు చేరవేశారు.
ఘటన స్థలానికి చేరుకున్న పోలీస్ అధికారులు గంటల పాటు బావిలో వెదుకులాడగా విద్యార్థి మృతదేహం లభ్యమైంది.
ఇదిలా ఉండగా సంఘటన ప్రదేశం నుంచి ట్యూటర్ వీరబాబు పారిపోవడం పట్ల మృతుడి విద్యార్థి కుటుంబ సభ్యులతో పాటు పలువురు అనుమాన వ్యక్తం చేస్తున్నారు.
తమ బాబుని ఉద్దేశపూర్వకంగానే భావి వద్దకు తీసుకువచ్చి ఉంటాడని ఆరోపిస్తున్నారు.బాబుకి ఈతరాదని తెలిసిన బావిలోకి దూకమని చెప్పడమేమిటని ప్రశ్నిస్తున్నారు.
వార్డెన్ నిర్లక్ష్యంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు.చనిపోయిన విద్యార్థి కుటుంబ సభ్యులు డెడ్ బాడీని పోస్టుమార్టం తీసుకువెళ్లేందుకు నిరాకరించారు.
చావుకు కారణమైన వార్డెన్ తో పాటు,ట్యూటర్ బత్తిని వీరబాబు ఘటన స్థలానికి వచ్చి తమకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
కాగా పోలీసులు జోక్యం చేసుకొని కుటుంబ సభ్యులకి నచ్చజెప్పి విద్యార్థి డెడ్ బాడీని పోస్టుమార్టం నిమిత్తం కోదాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
సంఘటన స్థలానికి జిల్లా అధికారి డీ.ఎస్.
ఏ.లత కోదాడ రూరల్ సీఐ రజిత రెడ్డి,ఎస్సై నవీన్ కుమార్, డిప్యూటీ తహసిల్దార్ శ్రీధర్,ఫైర్ అధికారులు పరిస్థితిని పరిశీలించారు.
చెట్ల కొమ్మల్లో ఇరుక్కున్న ఆవు.. ఎలా కాపాడాడో చూస్తే..