వరంగల్ నుంచి షిరిడి కి బస్.. సర్వీస్ లను ప్రారంభించిన కలెక్టర్

వరంగల్ నుంచి షిరిడీకి వెళ్లేందుకు వీకెండ్ సూపర్ లగ్జరీ సాయి దర్శన్ బస్సు సర్వీస్ ను హన్మకొండజిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు ప్రారంభించారు.

ఈ బస్సు సర్వీస్ వరంగల్ బస్సు స్టేషన్ నుండి మధ్యాహ్నం 01.45 గంటలకు బయలు దేరి హన్మకొండ బస్ స్టేషన్ నుండి మధ్యాహ్నం 02.

00 గంటలకు బయలు దేరి కరీంనగర్, జగిత్యాల, నిజామాబాదు, భోధన్, భీలోలి, నాందేడ్, పర్భని, జల్నా, ఔరాంగాబాద్ మీదుగా షిరిడి కి మరుసటి రోజు ఉదయం 06.

30 కి చేరుకుంటుందని తెలిపారు.ఈ సూపర్ లగ్జరీ బస్సు తిరిగి అదేరోజు సాయంత్రం 06.

00 లకు షిరిడి లో బయలు దేరి మరుసటి రోజు ఉదయం 11.

00 గంటలకు హన్మకొండ కు చేరుతుందని తెలిపారు.ఈ యొక్క సాయి ధర్శన్ సూపర్ లగ్జరి బస్సు ప్రతి శనివారం మాత్రమే నడుపబడుతుందని ప్రయాణికులు గమనించాలి అన్నారు.

ఈ యొక్క సర్వీస్ కు UP: 8355 మరియు DOWN : 8356 గల సర్వీస్ నంబర్స్ తో OPRS - ఆన్ లైన్ టికెట్ సౌకర్యం కలదు.

చార్జీ వివరాలు పెద్దలకు 1410 రూపాయలు కాగా, పిల్లలకు 730 రూపాయలు కావున ఈ సౌకర్యం ను జిల్లా ప్రయాణికులు వినియోగించు కోగలరని కలెక్టర్ కోరారు.

ఈ కార్యక్రమంలో ఆర్టీసీ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

పిరమిడ్స్ ఎలా కట్టారో వివరించిన ఎన్నారై రీసెర్చర్..?