పోలీస్ స్టేషన్ ఖాతానే హ్యాక్ చేసిన కేటుగాళ్లూ.. ఎక్కడంటే.. ?
TeluguStop.com

దేశంలో సైబర్ నేరగాళ్ల ఆగడాలకు అడ్డూ అదుపు లేకుండా పోతుంది.ఏ విధంగా డబ్బులను లాగేసుకుంటారో తెలియడం లేదు.


ఈ కేటు గాళ్లూ ఎవరిని వదిలి పెట్టడం లేదు.ఈ క్రమంలోనే ఏకంగా పోలీస్ స్టేషన్ ఖాతానే హ్యాక్ చేశారట.


ఆ వివరాలు తెలుసుకుంటే.వరంగల్ జిల్లా దామెర పోలీస్ స్టేషన్ ఫేస్ బుక్ ఖాతా హ్యాక్ అయిందని సమాచారం.
నేరగాళ్లు ఈ ఖాతాను హ్యాక్ చేసి డబ్బులు కోరుతూ పలువురికి మెసేజులు పంపారట.
కాగా ఈ విషయాన్ని ఎస్ఐ భాస్కర్ రెడ్డి దృష్టికి కొందరు తీసుకు రావడంతో వెలుగులోకి వచ్చింది.
వెంటనే అప్రమత్తం అయిన కమిషనరేట్‌లోని సైబర్ క్రైమ్ విభాగం పాత ఫేస్‌బుక్ అకౌంట్‌ను బ్లాక్ చేసింది.
ఇకపోతే దామెర పోలీస్ స్టేషన్ పేరుతో ఇటీవల కొత్త ఖాతా క్రియేట్ చేయడం వల్ల పాత అకౌంట్ ఉపయోగించడం లేదు పోలీసులు.
ఈ విషయన్ని గమనించిన సైబర్ నేరగాళ్లు పాత అకౌంట్ ను హ్యాక్ చేసి గూగుల్ పే, ఫోన్ పే ద్వారా డబ్బులు పంపాలని పలువురికి మెసేజులు పంపడం స్టార్ట్ చేశారట.
అయితే ఈ విషయం పై ఎవరు స్పందించక పోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.
తాటి బెల్లంతో వీటిని కలిపి తింటే అదిరే ఆరోగ్య లాభాలు మీసొంతం!