వంశీ వేసిన ఆ ఒక్క డైలాగ్‌తో వైసీపీలో ముసలం స్టార్ట్…!
TeluguStop.com
కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గంలో అధికార వైఎస్సార్సీపీలో రాజకీయ మంటలు మళ్లీ రాజుకున్నాయి.
ఆధిపత్య పోరులో పైచేయి సాధించేందుకు నాయకులు ఒకరిపై ఒకరు పోరాడుతున్న విషయం తెలిసిందే.
ఈ క్రమంలో తాజాగా జరిగిన ఘటన మరింత మంట రేపుతోంది.ఇక్కడ నుంచి గత ఏడాది జరిగిన ఎన్నికల్లో టీడీపీ నాయకుడు, కమ్మ వర్గానికి చెందిన వల్లభనేని వంశీ మోహన్ విజయం సాధించారు.
అయితే, తర్వాత కాలంలో ఆయన వైఎస్సార్ సీపీకి అనుకూలంగా మారిపోయారు.ఇక, ఇక్కడ నుంచి అదే పార్టీ తరఫున పోటీచేసి ఓడిపోయిన యార్లగడ్డ వెంకట్రావు.
వంశీని పార్టీలో చేర్చుకోవద్దని అప్పట్లోనే పెద్దగలాటా సృష్టించారు.అయితే, యార్లగడ్డకు డీసీసీబీ చైర్మన్ పదవిని ఇచ్చిన జగన్.
సైలెంట్ అయ్యేలా చేశారు.కానీ, ఇక్కడి నియోజకవర్గం బాధ్యతలను మాత్రం ఎవరికీ అప్పగించలేదు.
యార్లగడ్డకు ఇవ్వాలని ఆయన అనుచరులు ఆది నుంచి ఒత్తిడి చేస్తున్నారు అంటే.ఇక్కడ నుంచి ఎప్పుడు ఎన్నికలు జరిగినా యార్లగడ్డ పోటీ చేసేలా వ్యూహం సిద్ధం చేసుకునేందుకు ప్రయత్నించారు.
ఇక, టీడీపీని వీడి వచ్చిన తనకే ఇంచార్జ్ బాధ్యతలు ఇవ్వాలని వంశీ పట్టుబడుతున్నారు.
దీనిపై అధిష్టానం మౌనం పాటిస్తోంది.అయితే, ఈ వివాదం ఇలా ఉండగానే వంశీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
గన్నవరం నియోజకవర్గానికి ఎమ్మెల్యే, ఇంఛార్జి రెండూ నేనే.అని వంశీ ప్రకటించుకున్నారు.
"""/"/
అంతటితో ఆగకుండా.దుట్టా రామచంద్రావు, యార్లగడ్డ వెంకట్రావుతో కలిసి పనిచేస్తాను.
నాకు ఎలాంటి అభ్యంతరాలు, గొడవలు ఏం లేవు.నా దగ్గరకి కాళ్లకి చెప్పులేనివారు వచ్చినా మర్యాదగా ఆహ్వానించి మంచి కాఫీ ఇచ్చి పని చేసి పెడతా అన్నారు.
దీంతో వంశీ తనదే గన్నవరంలో పూర్తి ఆధిపత్యం అని చెప్పకనే చెప్పినట్టు అయింది.
దీంతో గన్నవరం ఇంఛార్జ్‌గా వంశీ తనను తాను ప్రకటించుకోవడం పట్ల కూడా యార్లగడ్డ వర్గం గుర్రుగా ఉంది.
మొదటి నుంచి జగన్ వెంట నడిచి, అండగా నిలిచిన నియోజకవర్గ వైసీపీ ముఖ్య నేత దుట్టా రామచంద్రరావు రూపంలో వంశీకి మరో గండం కూడా ఉంది.
దుట్టా కూడా వంశీకి సహకరించే పరిస్థితిలో లేరు.ఈ నేపథ్యంలో వంశీ వ్యాఖ్యలు సంచలనంగా మారడంతోపాటు పార్టీలో విభేదాలకు మరింత అవకాశం ఇచ్చినట్టుగా ఉన్నాయని అంటున్నారు పరిశీలకులు.
దూకుడు పెంచిన ఐటీ అధికారులు…దిల్ రాజుతో పాటు మైత్రి పై ఐటి దాడులు?