జగన్ పై దాడితో ఏపీలో వార్ వన్ సైడ్.. వైసీపీ మరోసారి అధికారంలో రానుందా?
TeluguStop.com
ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి( YS Jagan Mohan Reddy )పై పదునైన వస్తువుతో దాడి జరగగా పోలీసులు కేసు విచారణను ఇప్పటికే వేగవంతం చేశారు.
త్వరలో జగన్ పై దాడి చేసిన వ్యక్తిని గుర్తించి అరెస్ట్ చేస్తామని పోలీసులు చెబుతున్నారు.
మరోవైపు జగన్ పై దాడితో ఏపీలో వార్ వన్ సైడ్ అయిందని తెలుస్తోంది.
వైసీపీ మరోసారి అధికారంలో రానుందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.జరిగిన దాడి వల్ల వైసీపీకి సింపతీ ఓట్లు కూడా పడే ఛాన్స్ అయితే ఉంది.
"""/" /
మరోవైపు జగన్ బస్సు యాత్రను మళ్లీ మొదలుపెట్టగా మేమంతా సిద్ధం బస్సు యాత్రకు ఊహించని స్థాయిలో రెస్పాన్స్ వస్తుండటం వైసీపీ నేతలకు మరింత సంతోషాన్ని కలిగిస్తోందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.
జగన్ పై దాడి చేయించింది టీడీపీ( TDP )నే అని కొంతమంది సోషల్ మీడియా వేదికగా కామెంట్లు చేస్తుండగా ఆ కామెంట్లు నెట్టింట హాట్ టాపిక్ అవుతున్నాయి.
వైసీపీ మళ్లీ అధికారంలోకి వస్తే ఈసారి సంక్షేమంతో పాటు అభివృద్ధి చేస్తామని అధికార పార్టీ నేతలు చెబుతున్నారు.
ఎన్నికలు జరిగే సమయానికి పూర్తిస్థాయిలో వైసీపీకి అనుకూలంగా ఫలితాలు ఉండేలా జగన్ నిర్ణయాలు ఉండబోతున్నాయని తెలుస్తోంది.
జగన్ పై హత్యకు కుట్ర జరిగిందని మరి కొందరు నేతలు తీవ్రస్థాయిలో ఆరోపణలు చేస్తుండటం గమనార్హం.
"""/" /
వైఎస్ జగన్ ఎన్నికల సమయంలో తీసుకునే ప్రతి నిర్ణయం ఎంతో జాగ్రత్తగా తీసుకోవాల్సి ఉందని పొరపాట్లు చేస్తే ఫలితాలపై ఆ ప్రభావం పడుతుందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.
ఉభయ గోదావరి, కృష్ణా జిల్లా( Krishna District )లో వైసీపీకి అనుకూల పరిస్థితులు ఏర్పడితే మాత్రం ఈ ఎన్నికల్లో వైసీపీకి తిరుగుండదని తెలుస్తోంది.
చంద్రబాబు నాయుడు పదుల సంఖ్యలో హామీలను ప్రకటిస్తున్నా ఆ హామీలను ప్రజలు అయితే నమ్మే పరిస్థితి మాత్రం కనిపించడం లేదు.
చంద్రబాబు ఆచరణ సాధ్యం కాని హామీలను ప్రకటిస్తున్నారని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.
అతనే నా ఫస్ట్ క్రష్….మీనాక్షి చౌదరి ఇంట్రెస్టింగ్ కామెంట్స్!