తెలంగాణలో పెండింగ్ బిల్లులపై వార్..!

తెలంగాణలో పెండింగ్ బిల్లుల వ్యవహారంపై వివాదం ముదురుతోంది.ఈ విషయంపై ఇంతవరకు తనకు ఎలాంటి గవర్నర్ లేఖ అందలేదని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు.

రాజ్ భవన్ కార్యాలయం నుంచి లేఖ అందితే స్పందిస్తానని ఆమె పేర్కొన్నారు.ఈ క్రమంలో మంత్రి సబితా ఇంద్రారెడ్డి వ్యాఖ్యలపై రాజ్ భవన్ వర్గాలు స్పందించాయి.

గవర్నర్ కార్యాలయం నుంచి లేఖ రాలేదనడం సరికాదన్నారు.ఈనెల 7న మెసెంజర్ ద్వారా సమాచారం ఇచ్చామని తెలిపారు.

అయితే తెలంగాణలో పెండింగ్ బిల్లులపై చర్చించేందుకు రాజ్ భవన్ కు రావాలని గవర్నర్ తమిళిసై విద్యాశాఖ మంత్రికి సూచించిన విషయం తెలిసిందే.

ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వానికి గవర్నర్ ఓ లేఖను కూడా రాశారు.