పార్లమెంట్ లో టీడీపీ, వైసీపీ మధ్య మాటల యుద్ధం

పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో భాగంగా టీడీపీ, వైసీపీ నేతల మధ్య మాటల యుద్ధం జరిగింది.

టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్టుపై టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్, వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి మధ్య వాగ్వివాదం చెలరేగింది.

చంద్రబాబును అక్రమంగా అరెస్ట్ చేశారని ఆరోపించిన ఎంపీ గల్లా జయదేవ్ ఏపీలో చట్టాలను తుంగలో తొక్కారని విమర్శించారు.

ఈ విషయాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి దృష్టికి తీసుకెళ్తామని చెప్పారు.దీనిపై వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు.

చంద్రబాబు హయాంలోనే స్కిల్ డెవలప్ మెంట్ స్కాం జరిగిందని ఆయన ఆరోపించారు.చంద్రబాబుది అక్రమ అరెస్ట్ కాదన్న ఆయన ఫేక్ జీవోలు ఇచ్చి రూ.

371 కోట్లు గోల్ మాల్ చేశారని తెలిపారు.స్కిల్ డెవలప్ మెంట్ స్కాంలో సూత్రధారి చంద్రబాబేనని స్పష్టం చేశారు.

ఈ సింపుల్ రెమెడీతో పాదాలను తెల్లగా మృదువుగా మెరిపించుకోండి!