వైసీపీ, టీడీపీ నేత‌ల మధ్య వార్.. నువ్వానేనా అంటూ స‌వాళ్లు..

ఎంపీ గోరంట్ల మాధవ్‌కు సంబంధించిన నగ్న వీడియో కాల్‌ను రాష్ట్ర ప్రభుత్వం ఫోరెన్సిక్ పరీక్షకు పంపిందని వైసీపీ నేత‌లు చెబుతున్నారు.

అయితే ఇది నిజమని తేలితే ఎంపీపై ప్రభుత్వం, పార్టీ కఠిన చర్యలు తీసుకుంటాయని అంటున్నారు.

రాజమహేంద్రవరంలో నేత‌లు వీడియో కాల్‌ను ఎంపీ ఇప్పటికే ఖండించారని, ఇది మార్ఫింగ్ చేసిన వీడియో అని ఆరోపింస్తున్నారు వైసీపీ నేత‌లు.

మార్ఫింగ్ చేసిన వీడియోను విడుదల చేయడంలో కొందరి టీడీపీ నేతల పేర్లను కూడా ఆయన ప్రస్తావించారని వైసీపీ నేత‌లు చెబుతున్నారు.

ఎంపీ గోరంట్ల మాధవ్‌ పై నేరం రుజువైతే ఆయనపై ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని నేత‌లు తెలిపారు.

వీడియో కాల్‌ను మార్ఫింగ్ చేసిన వారితో సహా ఈ కేసులో ప్రమేయం ఉన్నవారిపై ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని అంటున్నారు నేత‌లు.

ఈ అంశంపై ప్రతిపక్ష టీడీపీ నేతలు హల్ చల్ చేయడాన్ని వైసీపీ నేత‌లు తప్పుబట్టారు.

ఈ మార్ఫింగ్‌ వీడియోను ఉపయోగించి టీడీపీ నేతలు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రతిష్టను దిగజార్చేందుకు ప్రయత్నిస్తున్నారని మండిపడుతున్నారు.

బూటకపు వార్తలు, కుట్రలతో రాజకీయ మైలేజీ పొందేందుకు టీడీపీ ప్రయత్నిస్తోందని వైసీపీ నేత‌లు ఆరోపించారు.

"""/"/ ఎంఆర్‌ఓను టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ అవమానిస్తే ఏం చేశారో చెప్పాలని టీడీపీ నేతలను ప్రశ్నించారు వైసీపీ నేత‌లు.

టీడీపీ మాజీ మంత్రి రావెల కిషోర్ బాబు కుమారుడు ముస్లిం మహిళను దూషించిన ఘటనలు, విజయవాడలో నమోదైన కాల్ మనీ-సెక్స్ రాకెట్‌లో పలువురు మహిళలను దోపిడీ చేసిన ఘటనలను కూడా ప్రస్తావించారు.

మహిళల సమస్యలను రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకోవడం మానుకోవాలని వైసీపీ నేత‌లు టీడీపీ నేతలకు సూచించారు.

మహిళలకు అన్యాయం జరిగితే జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం ఎవరినీ వదిలిపెట్టదని వైసీపీ పార్టీ నేత‌లు చెబుతున్నారు.

మిగిలిపోయిన చపాతీ పిండిని ఫ్రిడ్జ్ లో ఉంచి ఉపయోగిస్తున్నారా.. అయితే ప్రమాదంలో పడినట్లే..!