ప్రజల తెలంగాణకు, దొరల తెలంగాణకు మధ్య యుద్ధం..: రాహుల్ గాంధీ

ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ జడ్చర్లలో నిర్వహించిన కార్నర్ మీటింగ్ లో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేసీఆర్ ప్రభుత్వంపై ధ్వజమెత్తారు.బీఆర్ఎస్ పాలనలో తెలంగాణ ప్రజల కలలు నిర్వీర్యం అయ్యాయని రాహుల్ గాంధీ తెలిపారు.

కాళేశ్వరం ప్రాజెక్టులో భారీ ఎత్తున అవినీతి జరిగిందని ఆరోపించారు.లక్ష కోట్ల రూపాయలను మింగేసి, ప్రాజెక్టును సరిగా కట్టలేకపోయారని మండిపడ్డారు.

రాష్ట్రం అప్పులపాలైందన్నారు.పేదలు, బడుగు బలహీన వర్గాలకు చెందిన లక్ష కోట్ల రూపాయలను మింగేశారంటూ ధ్వజమెత్తారు.

రానున్న ఎన్నికలు ప్రజల తెలంగాణకు, దొరల తెలంగాణకు మధ్య జరుగుతున్న యుద్ధమని చెప్పారు.

ఓ వైపు ముఖ్యమంత్రి కుటుంబం, మరోవైపు పేదలు, యువత ఉన్నారని తెలిపారు.ప్రజల ప్రభుత్వం వస్తేనే మంచి జరుగుతుందని స్పష్టం చేశారు.

తాము ప్రకటించిన ఆరు గ్యారెంటీలను అధికారంలోకి రాగానే అమలు చేస్తామని తెలిపారు.

మినిష్టర్ పవన్ కు ఖరీదైన గిఫ్ట్ ఇచ్చిన వదినమ్మ.. మరిదిపై ఆప్యాయతకు ఫిదా అవ్వాల్సిందే!