తెలంగాణలో కుటుంబపాలనకు వ్యతిరేకంగా యుద్ధంః రాజగోపాల్ రెడ్డి
TeluguStop.com
తెలంగాణలో కుటుంబ పాలనకు వ్యతిరేకంగా యుద్ధం జరుగుతోందని రాజగోపాల్ రెడ్డి అన్నారు.బీజేపీ మునుగోడు సమరభేరీ సభలో ఆయన ప్రసంగించారు.
ఈ క్రమంలో కేసీఆర్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.నియోజకవర్గ అభివృద్ధి కోసం ఎన్నిసార్లు సీఎం అపాయింట్ మెంట్ కోరినా ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు.
మునుగోడు ఉపఎన్నిక వ్యక్తుల మధ్య జరిగే యుద్ధం కాదని, కేసీఆర్ అహంకారానికి, రాష్ట్ర ప్రజలకు మధ్య జరుగుతున్న యుద్ధమని వ్యాఖ్యనించారు.
ప్రజలు చారిత్రక తీర్పు ఇచ్చి టీఆర్ఎస్ పాలనకు చరమగీతం పాడాలని పిలుపునిచ్చారు.కేసీఆర్ పతనం మునుగోడు నుంచే ప్రారంభం అవుతుందని రాజగోపాల్ రెడ్డి తెలిపారు.
రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు.ప్రజల మీద నమ్మకం, విశ్వాసంతోనే పదవికి రాజీనామా చేసినట్లు వెల్లడించారు.
తనను గెలిపించిన ప్రజలకు న్యాయం చేసేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టం చేశారు.
ఈ నేపథ్యంలో కేసీఆర్ ను గద్దె దించి రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని నెలకొల్పాలన్నారు.తాను అమిత్ షాను కలిసి వచ్చిన నాటి నుంచి కేసీఆర్ కు నిద్ర పట్టడం లేదని ఎద్దేవా చేశారు.
రూ.1.50 కోసం 7 ఏళ్ల పోరాటం.. గ్యాస్ ఏజెన్సీకి దిమ్మతిరిగే షాక్!