జీవితంలో విజయం సాధించాలనుకుంటున్నారా..? అయితే ఇవి పాటించండి..!
TeluguStop.com
ఆచార్య చాణక్యుడు ఆర్థికవేత్తగా, దౌత్య వేత్తగా, మన్ననలు పొందిన వ్యక్తి.అయితే మౌర్య సామ్రాజ్య ఖ్యాతిని దేశం నలుదిక్కుల వ్యాపింప చేసిన, అసమాన ప్రతిభ కలిగిన వ్యక్తి ఆచార్య చాణక్యుడు సంబంధించి ఎన్నో విషయాలను నీతి శాస్త్రంలో బోధించారు.
మంచి చెడుల గురించి వివరిస్తూనే జీవితంలో ఏం చేస్తే విజయాన్ని సాధించగలం.ఏం చేస్తే ఆనందాన్ని పొందగలం అనే విషయాలను కూడా ఆయన వివరించారు.
అందులో కొన్నింటిని ఇప్పుడు తెలుసుకుందాం.నిజాయితీ లేని వ్యక్తి జీవితం, పతనం కావడం ఖాయమని తెలిపారు.
అలాగే నిజాయితీ( Honesty ) లేని అతి తక్కువ సమయంలో విజయాన్ని సాధించినప్పటికీ అది ఎక్కువ కాలం నిలవదని కూడా చెప్పారు.
"""/" / అటువంటి వ్యక్తులు ఎల్లప్పుడూ లోలోపల కంగారుపడుతూ ఉంటారు.అలాగే నిజాయితీ లేని మనిషికి అదే పెద్ద శిక్ష అని చాణక్యుడు పేర్కొన్నారు.
అందుకే నిజాయితీగా ఉండాలని, అలాగే ఎప్పుడు మనస్సాక్షి చెప్పేదే వినాలని ఆయన సూచించారు.
మనిషికి అతిపెద్ద శత్రువు సోమరితనమ( Laziness )ని తెలిపారు.అయితే కష్టపడటానికి, ఇష్టపడని వ్యక్తి జీవితంలో రాణించలేరని పేర్కొన్నారు.
అలాగే వారికి కష్టపడే సామర్థ్యం ఉండాలి.ఇక శ్రమ పడితేనే వ్యక్తిని సైతం మార్చగలడని చెప్పారు.
కానీ సోమరితనాన్ని కలిగి ఉంటే మాత్రం వ్యక్తి జీవితం నాశనం అయినట్లే అని వెల్లడించారు.
"""/" /
అదుపులో ఉంచుకునే వ్యక్తులు మాత్రమే సమాజంలో గౌరవాన్ని పొందడంతో పాటు, సంతోషంగా ఉంటారని చాణక్యుడు ( Acharya Chanakya )తెలిపారు.
అలాగే పనికిరాని విషయాలను ప్రస్తావించేవారు తప్పుగా మాట్లాడేవారు తరచూ వివాదాల్లో భాగస్వాములు అవుతారని పేర్కొన్నారు.
అలాంటి వ్యక్తులు జీవితంలో విజయాన్ని సాధించలేరని వెల్లడించారు.అందుకే విజయవంతమైన జీవితం గడపాలంటే మాటపై నియంత్రణ ఉండాలి.
అదేవిధంగా ఇతరులపై ఆధారపడి జీవించే వ్యక్తులు కూడా ఎప్పుడు విజయాన్ని సాధించలేరు వివరించారు.
ఢిల్లీకి రేవంత్ .. మంత్రివర్గ విస్తరణలో వీరికే ఛాన్స్ ?