బరువు తగ్గాలనుకుంటున్నారా?అయితే ఈ పండు తినండి!
TeluguStop.com
ఈ మధ్యకాలంలో ఆహారపు అలవాట్ల కారణంగా ఎంతోమంది ఎక్కువగా ఫాస్ట్ ఫుడ్, తినడానికి మక్కువ చూపుతున్నారు.
దీనిద్వారా వారికి తెలియకుండానే వారి శరీర బరువు అధికంగా పెరిగి ఊబకాయానికి దారితీస్తుంది.
ఈ క్రమంలోనే బరువు తగ్గాలనుకొని ఎంతోమంది ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు.అయినా వాటి వల్ల పెద్దగా ఫలితాలను పొందలేక సతమతమవుతున్నారు.
అలా అధికంగా బరువు ఉన్నవారు కొన్ని ఆహార నియమాలు పాటించడం వల్ల బరువు తగ్గవచ్చు.
ఈ బరువు తగ్గే విషయంలో కివి పండ్లు ఎంతగానో ఉపయోగపడతాయని వైద్యులు చెబుతున్నారు.
కివి ఆరోగ్య పరంగా ఎలాంటి ప్రయోజనాలను కలిగి ఉంటుంది ఇక్కడ తెలుసుకుందాం. """/"/
కివి పండును పోషకాల రారాజు అని కూడా పిలుస్తారు.
చూడటానికి సపోటా పండు ఆకారంలో ఉన్నప్పటికీ ఇందులో పోషకాలు పుష్కలంగా లభిస్తాయి.ఇందులో విటమిన్ సి నారింజ పండులో కన్నా రెండు శాతం అదనంగా ఉంటుంది.
ఈ కివి పండులో సోడియం, కొవ్వు శాతం తక్కువగా ఉండటం వల్ల మధుమేహంతో బాధపడే వారు సైతం ఎలాంటి సంకోచం చెందకుండా ఈ పండ్లు తినవచ్చు.
"""/"/
ఈ కివి పండులో లభించే పోషకాలు దాదాపు 27 పండ్లలో లభ్యమయ్యే పోషకాలతో సమానం.
అందుకే కివిని పోషకాల రారాజు అని పిలుస్తారు.ఇందులో ఉన్న యాంటీ ఆక్సిడెంట్లు చెడు కొలెస్ట్రాల్ ను తగ్గించడంలో కీలక పాత్ర పోషిస్తాయి.
దీని ద్వారా అధిక బరువు సమస్యతో బాధపడేవారు బరువు తగ్గడానికి ఈ పండు ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది.
ఇందులో ఉండే ఫైబర్ మన శరీరంలో జీర్ణక్రియ వ్యవస్థ మెరుగు పరచడంలో కీలకపాత్ర పోషిస్తుంది.
ప్రతి రోజు ఒక కివి తీసుకోవడం వల్ల మన శరీరంలో రోగనిరోధక శక్తి మెరుగు పడటమే కాకుండా ఎటువంటి కంటి సమస్యలు దరిచేరకుండా కాపాడుతుంది.
అయితే కొంతమంది కివి పండును తొక్కతీసి తింటుంటారు కానీ గుజ్జు కన్నా తొక్క నుంచి మనకు ఎన్నో పోషకపదార్థాలు లభిస్తాయని నిపుణులు చెబుతున్నారు.
టిడిపిలోకి బీఆర్ఎస్ ఎమ్మెల్యే లు ? వారు ఎవరంటే ?