బరువు తగ్గాలనుకుంటున్నారా..? అయితే బ్రేక్ ఫాస్ట్ లో వీటికి దూరంగా ఉండండి..!

ఈ మధ్యకాలంలో చాలా మంది అధిక బరువు కారణంగా బాధపడుతున్నారు.బరువు తగ్గడానికి ఎన్నో వ్యాయామాలు, డైట్లు ప్లాన్ చేస్తున్నారు.

అయితే రోజును ఆరోగ్యంగా ప్రారంభించాలంటే అత్యంత ముఖ్యమైన బ్రేక్ ఫాస్ట్ లో ప్రోటీన్, ఫైబర్లతో కూడిన ఆహారాన్ని తీసుకోవడం చాలా అవసరం.

వీటితో కూడిన ఆహారం తీసుకోవడం వలన ఆ రోజు మొత్తం హాయిగా గడుస్తుంది.

లేదంటే చిరాకుగా ఉంటే ఏ పని చేయాలన్నా కూడా ఉత్సాహం లేకుండా పోతుంది.

ఇక చాలామంది బ్రేక్ ఫాస్ట్ విషయంలో రుచికరంగా ఉండే వాటికి ప్రాధాన్యతను ఇస్తారు.

అయితే అంత ఉదయాన్నే అధిక చక్కెర కొవ్వులు కలిగిన పిండి పదార్థాలు( Carbohydrates ) తీసుకోవడం వలన మనకు తెలియకుండానే శరీరంలో అధిక కేలరీలు, కొవ్వుని అమాంతం పెంచేస్తాయి.

"""/" / అలాంటి సమయంలో తక్కువగానే ఫుడ్ తీసుకున్నప్పటికీ కూడా మనకు తెలియకుండా బరువు పెరిగిపోతాము.

ముఖ్యంగా బరువు తగ్గాలనుకున్నవారు అలాగే మంచి ఆరోగ్యం కావాలనుకున్నవారు బ్రేక్ ఫాస్ట్ లో వీటికి దూరంగా ఉండాలి.

అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.ఉదయాన్నే చక్కెర లేదా క్రంచీగా ఉండే పదార్థాలను తీసుకోవడం అంత మంచిది కాదు.

సాధారణంగా వీటిలో చక్కెర ఉండడంతో రక్తంలో షుగర్ లెవెల్స్ వేగంగా పెరుగుతాయి.దీంతో చక్కెరను తగ్గించే హార్మోన్ పై ప్రభావం పడుతుంది.

అంతేకాకుండా కార్న్ ప్లెక్స్ ( Corn Flakes )లాంటివి తీయని తృణ ధాన్యాలలో ప్రోటీన్లు తక్కువగా ఉంటాయి.

"""/" / అంతేకాకుండా అందులో చక్కెర స్థాయిలు లేకపోయినప్పటికీ బ్రేక్ ఫాస్ట్ గా తీసుకోవడం మంచిది కాదని వైద్య నిపుణులు చెబుతున్నారు.

వీటి కారణంగానే గుండె జబ్బులు( Heart Diseases ), టైప్ టు మధుమేహం లాంటి వ్యాధుల బారినపడే అవకాశం ఉంటుంది.

అల్పాహారంలో వెన్నతో చేసిన టోస్ట్, పూరీలు లాంటివి తీసుకోవడం వలన కూడా ఎలాంటి లాభం ఉండదు.

వీటిని ఉదయాన్నే తీసుకోవడం వలన ఎసిడిటీ, గుండెల్లో మంట లాంటివి వస్తాయి.డీప్ ఫ్రై చేసిన ఆహారం ఏదైనా కానీ లివర్ కి అస్సలు మంచిది కాదు.

అందుకే ఇలాంటి డీప్ ఫ్రై చేసిన ఆహారాన్ని బ్రేక్ ఫాస్ట్ లో తీసుకుంటే ఫ్యాటీ లివర్ వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి.

ఏకంగా హీరోనే డామినేట్ చేసిన టాలెంటెడ్ యాక్టర్స్.. ఎవరంటే..?