ఐబ్రోస్ ఒత్తుగా పెరగాలా.. ఈ సింపుల్ టిప్స్ ట్రై చేస్తే సరి!
TeluguStop.com
సాధారణంగా ఐబ్రోస్ ఒత్తుగా ఉంటే.ముఖం అందంగా, నిండు కనిపిస్తుంది.
అందుకే ఒత్తైన ఐబ్రోస్ కావాలని అందరూ కోరుకుంటారు.కానీ, కొందరి ఐబ్రోస్ చాలా పల్చగా ఉంటాయి.
ఇలాంటి వారు చేసేదేమి లేక పెన్సిల్‌తో తీర్చిదిద్దుకుంటారు.కానీ, ఇలా చేయడం వల్ల లుక్ అంత ఎట్రాక్టివ్‌గా ఉండదు.
అయితే కొన్ని కొన్ని సింపుల్ టిప్స్‌ను పాటిస్తే.న్యాచురల్‌గానే ఐబ్రోస్‌ను ఒత్తుగా మార్చుకోవచ్చు.
మరి ఈ టిప్స్ ఏంటో లేట్ చేయకుండా ఓ లుక్కేసేయండి.ఉల్లిపాయ రసం.
ఐబ్రోస్‌ను ఒత్తుగా మరియు నల్లగా పెంచడంలో గ్రేట్‌గా సహాయపడుతుంది.అందువల్ల, ఉల్లిపాయల నుంచి ఉల్లి రసం తీసుకుని.
ఐబ్రోస్ ప్రాంతంలో అప్లై చేయాలి.రోజులో రెండు సార్లు ఉల్లి రసం అప్లై చేయాలి.
ఇలా కొన్ని రోజుల పాటు చేస్తే.మీ ఐబ్రోస్ గ్రోత్ అద్భుతంగా ఉంటుంది.
అలాగే మెంతులను బాగా నానబెట్టి.పేస్ట్ చేసుకోవాలి.
ఈ పేస్ట్ రాత్రి నిద్రించే ముందు కనుబొమ్మలకు ప్యాక్‌లా వేయాలి.ఉదయం చల్లటి నీటితో క్లీన్ చేసుకోవాలి.
ఇలా ప్రతి రోజు చేసినా మంచి ఫలితం ఉంటుంది. """/"/
కొబ్బరిపాలు కూడా ఐబ్రోస్‌ను ఒత్తుగా పెంచగలవు.
కాబట్టి, కాబ్బరి పాలను దూది సాయంతో కనుబొమ్మలకు అప్లై చేయాలి.బాగా ఆరిన తర్వాత కోల్డ్ వాటర్‌ను శుభ్రం చేసుకోవాలి.
ఇలా రెగ్యులర్‌గా చేస్తే.మీ ఐబ్రోస్ ఒత్తుగా పెరుగుతాయి.
ఇక మందారం పవ్వులను మెత్తగా పేస్ట్ చేసి.కనుబొమ్మలపై అప్లై చేయాలి.
పావు గంట లేదా ఇరవై నిమిషాల పాటు ఆరనిచ్చి.ఆ తర్వాత మెల్లగా నీటి సాయంతో క్లీన్ చేసుకోవాలి.
ఇలా చేసినా ఐబ్రోస్ ఒత్తుగా మరియు వేగంగా పెరుగుతుంది.అలాగే పాలలో నిమ్మరసం మిక్స్ చేసి.
ఆ మిశ్రమాన్ని కనుబొమ్మలకు అప్లై చేయాలి.పది నిమిషాల తర్వాత గోరు వెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి.
ఇలా చేసినా మంచి ఫలితం ఉంటుంది.
కూతుర్ని పైలట్‌ను చేసిన తండ్రి.. ఆయన కూడా పైలటే.. ఆమె ఫ్లైట్‌లోనే రిటైర్డ్!