ఇంట్లోనే మృదువైన చర్మం పొందాలనుకుంటున్నారా? అయితే ఈ చిట్కాలు పాటించండి..!
TeluguStop.com
ముఖ్యంగా చెప్పాలంటే ప్రస్తుత సమాజంలో అమ్మాయిలతో పాటు మగవారు కూడా అందంపై ప్రత్యేక శ్రద్ధను చూపుతున్నారు.
ప్రతి ఒక్కరూ మెరిసే మృదువైన చర్మం( Smooth Skin ) కావాలని కలలు కంటూ ఉంటారు.
మెరిసే అందం కోసం చాలామంది వారానికి ఒక రోజు బ్యూటీ పార్లర్ కు వెళ్లి ఫేషియల్స్, స్పా చేయించుకుంటూ ఉంటారు.
మరి కొంతమంది సోషల్ మీడియాలో ఉన్న వీడియోలను చూసి అందులోని చిట్కాలను అనుసరిస్తూ ఉంటారు.
కానీ తక్కువ ఖర్చుతో బ్యూటీ పార్లర్ కు వెళ్లకుండా నెల రోజుల్లో మృదువైన మెరిసే చర్మాన్ని పొందాలంటే ఈ చిట్కాలను పాటించండి.
ముఖ్యంగా చెప్పాలంటే సమాన మొత్తంలో తేనే, నిమ్మరసం( Honey Lemon Juice ) ఒక గిన్నెలో కలుపుకోవాలి.
ఈ మిశ్రమాన్ని చర్మంపై అప్లై చేసి 15 నుంచి 20 నిమిషాల పాటు ఉంచాలి.
"""/" /
తేనే చర్మాన్ని తేమగా మృదువుగా మారుస్తుంది.నిమ్మరసం ( Lemon Juice )కూడా చర్మాన్ని మృదువుగా మార్చడంలో ఎంతగానో ఉపయోగపడుతుంది.
అంతే కాకుండా పండిన అవకాడోను తీసుకొని మెత్తగా పేస్టులా చేసుకోవాలి.తర్వాత ఈ మిశ్రమాన్ని మెడ, ముఖం, చేతులు, కాళ్లకు అప్లై చేసుకుని 20 నిమిషాల పాటు అలాగే ఉంచాలి.
ఆ తర్వాత గోరువెచ్చటి నీటితో శుభ్రం చేసుకోవాలి.ఇంకా చెప్పాలంటే పుల్లని పెరుగులో దోసకాయ ముక్కలు ( Cucumber Slices )వేసుకోవాలి.
ఈ ఫేస్ ప్యాక్ మీ చర్మానికి కూలింగ్ ఎఫెక్ట్ ను ఇస్తుంది.ఇప్పుడు ఈ ఫేస్ ప్యాక్ నీ ముఖానికి అప్లై చేసి 20 నిమిషముల తర్వాత శుభ్రం చేసుకోవాలి.
ఇలా చేస్తే చర్మనికి మళ్ళీ తాజాదనం వస్తుంది. """/" /
అలాగే ఇందులో ఉండే మాయిశ్చరైజింగ్ ఏజెంట్ చర్మాన్ని మృదువుగా మారుస్తుంది.
ఇంకా చెప్పాలంటే పాలు( Milk ) కలిపిన నీళ్లతో స్నానం చేయడం వల్ల కూడా చర్మం మృదుగా మారుతుంది.
స్నానం చేసే నీళ్లలో కొన్ని కప్పులు పాలు కలుపుకోవాలి.ఇలా పాల స్నానం చేయలేకపోతే కనీసం ముఖాము వరకైనా రోజు పాలతో శుభ్రం చేసుకోవాలి.
అలాగే అలోవెరా జెల్( Aloe Vera Gel ) ను తీసుకుని చర్మంపై మసాజ్ చేసుకుంటూ ఉండాలి.
రోజుకు రెండుసార్లు అలోవెరా జెల్ ని ఇలా ఉపయోగించడం వల్ల చర్మం మృదువుగా తేమగా ఉంటుంది.
ఆ బ్యానర్ లో మూడు సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన ప్రభాస్.. బంపర్ ఆఫర్ ఇచ్చారుగా!