జిమ్ లో కండలు పెంచాలనుకుంటున్నారా.. అయితే ఇది మీకోసమే..!
TeluguStop.com
ప్రస్తుత కాలంలో చాలామంది యువత వారి ఉద్యోగాల వల్ల బిజీబిజీగా ఉన్నారు.దీనివల్ల ఎక్కువగా ఆరోగ్యం పై శ్రద్ధ చూపలేకపోతున్నారు.
ఈ మధ్యకాలంలో యువతలో అధిక బరువు సమస్య ఎక్కువగా ఉంటుంది.అందుకోసం కొంతమంది యువత మాత్రమే ఉదయం, సాయంత్రం జిమ్ లో( Gym ) వెళ్లి కసరత్తులు చేస్తున్నారు.
ఇంకా చెప్పాలంటే మంచి ఆరోగ్యానికి వ్యాయామం కచ్చితంగా అవసరం.అయితే కొంతమంది యువత కండలు పెంచాలని( Muscles ) సరైన శరీర ఆకృతి వారికి ఉండాలని ఎంతో కష్టపడి పోతూ ఉంటారు.
సాధారణంగా మజిల్స్ సరిగ్గా ఉంటేనే శరీరం అంతా అందంగా కనిపిస్తుంది.ఈ కసరత్తులు చేసే సమయంలో మంచి ఆహారంతో పాటు సరైన విశ్రాంతి కూడా అవసరం అని నిపుణులు చెబుతున్నారు.
ఇలా కండలు పెంచడానికి ఏం చేయాలో దాన్ని ఇప్పుడు తెలుసుకుందాం.శరీరం ఎక్కువగా ఆమెనో ఆమ్లాలను ఉపయోగించుకుంటేనే మన శరీరంలోని కండలు పెరుగుతాయి.
అందుకే మజిల్ బిల్డింగ్ టార్గెట్గా ఉన్నవారు ఎక్కువగా ఆ ప్రోటీన్ ఫుడ్( Protein Food ) తీసుకుంటూ ఉండడం వల్ల వారి శరీరానికి ఆమైనో యాసిడ్స్ ఎక్కువగా అందిస్తూ ఉండాలి.
ముఖ్యంగా కండలు పెంచాలనుకునేవారు ప్రతిరోజు సరైన వ్యాయామాలను ట్రైనర్ సలహాతో చేస్తూ ఉండాలి.
"""/" /
జిమ్ లో వ్యాయామం ( Workouts ) సరిగ్గా చేయలేకపోతే ఎన్నో ఇబ్బందులను ఎదుర్కోవాల్సి ఉంటుంది.
కొన్ని సమయాలలో ఎముకలు కండరాలు దెబ్బతినే అవకాశం కూడా ఉంది.అందుకే దీనికోసం నిపుణుల సలహాతో కండలకు సంబంధించిన వ్యాయామాలు చేయడం మంచి పద్ధతి.
ఏదో ఒక రోజులోనే కండలు పెంచేయాలి అని వేగంగా ఎక్కువ సేపు వ్యాయామం చేయడం వల్ల లేనిపోని అనారోగ్యాలు వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి.
"""/" /
అంతేకాకుండా ఇలాంటి సమయంలో ప్రోటీన్ ఎక్కువగా ఉపయోగించడానికి బదులు ప్రోటీన్లు కార్బోహైడ్రేట్లు ఉన్న మిల్క్ షేక్స్( Milk Shakes ) తాగుతూ ఉండడం మంచిది.
ప్రతిరోజు వ్యాయామం చేయడం వల్ల మన శరీర భాగాలకు రక్త ప్రసరణ పెరుగుతుంది.
ఇలాంటి కష్టతరమైన వ్యాయామాలు చేసేటప్పుడు ప్రతిరోజు కచ్చితంగా ఎనిమిది నుంచి పది గంటలు నిద్ర పోవడం ఎంతో మంచిది.
అంతసేపు నిద్ర లేకపోయినా ప్రతిరోజు ఒకే సమయానికి పడుకొని ఒకే సమయానికి నిద్రలేచిన ఎంతో మంచిది.
అయితే ఈ ప్రయత్నాలు అన్ని నిపుణుల సలహా తోనే చేయాలి.
ఎన్టీఆర్ తో సినిమా చేయటమే నా డ్రీమ్…. మనసులో కోరిక బయటపెట్టిన నటి?