పుష్పరాజ్ తో నటించాలనుంది... మనసులో మాటను బయటపెట్టిన అలియా!

రాజమౌళి దర్శకత్వంలో పాన్ ఇండియా స్థాయిలో మార్చి 25వ తేదీన ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయం కాబోతోంది బాలీవుడ్ ముద్దుగుమ్మ అలియా భట్.

మొట్టమొదటిసారిగా ఈ సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయం కానున్న ఈమె ఓ సందర్భంలో తన మనసులో మాటలను బయట పెట్టింది.

ఈ సందర్భంగా ఈమె మాట్లాడుతూ క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా నటించిన పుష్ప సినిమా గురించి మాట్లాడారు.

ఈ సందర్భంగా ఈమె మాట్లాడుతూ తాజాగా తన కుటుంబం మొత్తం పుష్ప సినిమా చూశామని ఈ సినిమా చూసిన తర్వాత తన కుటుంబ సభ్యులు అందరూ కూడా అల్లు అర్జున్ కి ఫ్యాన్స్ అయిపోయారని తెలియజేశారు.

ఈ సినిమా చూసిన తర్వాత తన కుటుంబ సభ్యులు అందరూ తనని అల్లుఅర్జున్ సరసన ఎప్పుడు నటిస్తావని అడుగుతున్నట్లు తెలియజేశారు.

పుష్ప చిత్రం ద్వారా పాన్ ఇండియా స్టార్ హీరోగా గుర్తింపు పొందిన అల్లు అర్జున్ సరసన నటించే అవకాశం వస్తే తప్పకుండా నటిస్తానని ఈ సందర్భంగా అలియా తన మనసులో మాటను బయటపెట్టారు.

"""/"/ అల్లుఅర్జున్ తో కలిసి నటించడానికి తాను ఎంతగానో ఎదురుచూస్తున్నానని ఈ సందర్భంగా ఈ బ్యూటీ తెలియజేశారు.

రాజమౌళి సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయం కాబోతున్న ఈ ముద్దుగుమ్మ ఇప్పటికే ఎన్టీఆర్ కొరటాల శివ దర్శకత్వంలో రానున్న చిత్రంలో హీరోయిన్ గా నటించే అవకాశాన్ని దక్కించుకున్నారు.

మరి పుష్ప రాజ్ తో కలిసి నటించే అవకాశం ఈమెకు ఎప్పుడు వస్తుందో.

ఈ విషయంపై అల్లు అర్జున్ ఎలా స్పందిస్తారో తెలియాల్సి ఉంది.

వీడియో వైరల్‌.. చెత్త లారీతో డోనాల్డ్ ట్రంప్‌