గన్ను కావాలి.. గర్ల్ ఫ్రెండ్ కావాలి షాకింగ్ కామెంట్స్ చేసిన నాగార్జున!

టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున తాజాగా నటించిన చిత్రం ది ఘోస్ట్.ఈ సినిమా ఎన్నో అంచనాల నడుమ అక్టోబర్ 5వ తేదీ ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఇక ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడటంతో పెద్ద ఎత్తున చిత్ర బృందం ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.

ఈ ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా ఇప్పటికే కర్నూలులో ప్రీ రిలీజ్ వేడుకను నిర్వహించిన విషయం తెలిసిందే.

ఇదిలా ఉండగా తాజాగా ఈ సినిమా నుంచి ట్రైలర్ విడుదల చేశారు.ఈ ట్రైలర్ రిలీజ్ అనంతరం చిత్ర బృందం మీడియా సమావేశంలో ముచ్చటించారు.

ఇకపోతే ఈ సమావేశంలో భాగంగా నాగార్జున సినిమా గురించి ఎన్నో విషయాలను ముచ్చటించారు.

ఈ క్రమంలోనే ఒక రిపోర్టర్ నాగార్జునను ఓ వింత ప్రశ్న అడిగారు.ఈ సందర్భంగా రిపోర్టర్ ప్రశ్నిస్తూ మీ సినిమాలలో హీరోయిన్లతో మీకు రొమాన్స్ చేయడం ఇష్టమా లేకపోతే గన్నులతో ఫైరింగ్ చేయడం ఇష్టమా అంటూ వింత ప్రశ్న వేశారు.

ఈ ప్రశ్నకు నాగార్జున సమాధానం చెబుతూ తనకు ఒకవైపు గర్ల్ ఫ్రెండ్స్ తో రొమాన్స్ చేయడం ఇష్టం అలాగే మరోవైపు గన్నులతో ఫైరింగ్ చేయడం కూడా ఇష్టం అంటూ దిమ్మతిరిగే సమాధానం చెప్పారు.

ఈ విధంగా నాగార్జున ఇలాంటి సమాధానం చెప్పడంతో అక్కడ కాస్త ఫన్నీ వాతావరణం నెలకొంది.

"""/" / ఇక ఈ సినిమా గురించి నాగార్జున మీడియా సమావేశంలో ఎన్నో విషయాలను ముచ్చటించారు.

అలాగే దర్శకుడు ప్రవీణ్ సత్తార్ కూడా ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈ సినిమా ఫైనల్ కాపీ చూసామని సినిమా చూస్తున్నంత సేపు చాలా ఎక్సైట్ అయ్యాం అని తెలిపారు.

అలాగే ప్రేక్షకులు కూడా ఈ సినిమాని చూస్తున్నంత సేపు అదే ఎగ్జైటింగ్ గా ఫీల్ అవుతారని భావిస్తున్నాము.

ఇక ఈ సినిమా విజయదశమి రోజు విడుదల కానుంది.ఈ సినిమాని ఆదరిస్తారని భావిస్తున్నాము అంటూ ఈ సందర్భంగా సినిమా గురించి పలు విషయాలను వెల్లడించారు.

Holi Accident : వీడియో వైరల్: మీ ఆనందం కోసం ఇలా చేస్తే ఎలా..? చిన్న తప్పు ఎంత ప్రమాదాన్ని కలిగించిందో..!