రూ.10వేలలో మంచి స్మార్ట్‌ఫోన్‌ కావాలనుకుంటున్నారా? అయితే ఇవి చూడండి!

ఈ స్మార్ట్ యుగంలో దాదాపు అందరి చేతుల్లో స్మార్ట్‌ఫోన్‌లు కొలువుదీరాయి.చిన్నపిల్లలనుండి పెద్దవాళ్లవరకు అందరూ దానితో సహవాసం చేస్తున్నారు.

ముఖ్యంగా ఇప్పుడు స్టూడెంట్స్ కి కూడా స్మార్ట్ ఫోన్ అనేది తప్పనిసరి అయిపోయింది.

ఈ క్రమంలో అనేకమంది దిగువ మధ్యతరగతివారు ఫోన్ కొనాలంటే కాస్త భయపడాల్సిన పరిస్థితి.

ఓ మంచి ఫోన్ కొనాలంటే 15 వెళ్లనుంది 20 వేలు పెట్టాల్సిన పరిస్థితి.

ఈ నేపథ్యంలో 10 వేలు, అంతకంటే తక్కువ ధర కలిగి, మంచి నాణ్యత కలిగిన ఫోన్స్ గురించి తెలుసుకోవలసిన అవసరం ఎంతైనా వుంది.

అలాంటివారికోసమే ఈ వ్యాసం.ఇపుడు 6 అంగుళాలకు మించిన డిస్‌ప్లే, ఫుల్‌ HD+ వ్యూ కలిగి, 4జీబీ ర్యామ్ అలాగే అద్భుతమైన రియర్ కెమెరా సెట్ అప్ గల వేరియంట్‌లను ఇపుడు పరిశీలిద్దాము.

మార్కెట్లో మనకు రూ.10,000 లోపు ధరలో కొన్ని స్మార్ట్‌ఫోన్‌లు అందుబాటులో వున్నాయి.

అందులో మొదటిది రియల్‌మి C30 స్మార్ట్‌ఫోన్‌.ఈ ఫోన్ నిన్ననే ఇండియాలో రూ.

7,499 ధర వద్ద విడుదలైంది.ఇది 6.

5-అంగుళాల డిస్‌ప్లే కలిగి, 32GB UFS 2.2 స్టోరేజ్ స్పేస్‌తో, 2GB మరియు 3GB RAM వేరియంట్లలో లభిస్తుంది.

ఇది మంచి ఆప్షన్. """/"/ ఇక 2వది Poco C3 స్మార్ట్‌ఫోన్‌.

ఇది కేవలం రూ.7,999 ధరకే లభిస్తుంది.

ఇది కూడా ఇది 6.53-అంగుళాల HD+ LCD డిస్‌ప్లేతో 4GB RAM మరియు 64GB ఇంటర్నల్ స్టోరేజ్ తో వస్తుంది.

ఇక ముచ్చటగా 3వది రియల్‌మి నార్జో 30A స్మార్ట్‌ఫోన్.వాటి మాదిరిగానే ఇది కూడా 6.

5-అంగుళాల HD+ డిస్‌ప్లేను 1600 X 720 పిక్సెల్‌ల స్క్రీన్ రిజల్యూషన్, 6,000 MAh బ్యాటరీతో వస్తుంది.

ఈ లిస్టులో 4వది Redmi 10A స్మార్ట్‌ఫోన్.ఇది 4GB ర్యామ్ వేరియంట్ కలిగి 6.

53-అంగుళాల డిస్‌ప్లేను కలిగి వుంది.చివరిది Infinix Hot 12 Pro.

ఇది 6.91-అంగుళాల IPS LCD డిస్‌ప్లేను కలిగి, 64MP ప్రధాన కెమెరా, 8MP సెకండరీ లెన్స్, 5MP సెన్సార్ మరియు 2MP డెప్త్ కెమెరా కలిగి వుంది.

పూర్తి వివరాలకు సంబంధిత సైట్ చూడగలరు.