వాల్తేరు వీరయ్య ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్.. అధికారకంగా ప్రకటించిన నెట్ ఫ్లిక్స్!

మెగాస్టార్ చిరంజీవి రీ ఎంట్రీ తర్వాత వరుస సినిమాలతో ఎంతో బిజీగా గడుపుతున్నారు.

ఇలా వరుస సినిమాలతో ఎంతో బిజీగా ఉన్నటువంటి చిరంజీవి తాజాగా సంక్రాంతి పండుగ సందర్భంగా బాబీ దర్శకత్వంలో తెరకెక్కిన వాల్తేరు వీరయ్య సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు.

శృతిహాసన్ చిరంజీవి హీరో హీరోయిన్లుగా నటించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎంతో అద్భుతమైన విజయాన్ని అందుకుంది.

ఇలా ఈ సినిమా దాదాపు 250 కోట్లకు పైగా కలెక్షన్లను రాబట్టి సంచలనాలను సృష్టించింది.

"""/"/ ఇలా థియేటర్లలో ఎంతో సక్సెస్ ఫుల్ గా రన్ అవుతున్న ఈ సినిమా థియేటర్లలో విడుదలై 25 రోజులను పూర్తి చేసుకుంది.

అయితే ఈ సినిమా థియేటర్ రన్ పూర్తి కావడంతో త్వరలోనే ఓటీటీలో విడుదల కావడానికి సిద్ధమవుతోంది.

ఈ సినిమా ఓటీటీ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ భారీతరలకు కొనుగోలు చేశారు.

ఈ క్రమంలోనే త్వరలోనే ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ కానుందని తెలుస్తోంది. """/"/ ఇక ఈ సినిమా థియేటర్ పూర్తి చేసుకున్న అనంతరం ఈ చిత్రాన్ని డిజిటల్ మీడియాలో స్ట్రీమింగ్ చేయనున్నారు.

దీంతో నెట్ ఫ్లిక్స్ ఈ విషయం గురించి అధికారకంగా ప్రకటిస్తూ ఫిబ్రవరి 27వ తేదీ నుంచి వాల్తేరు వీరయ్య నెట్ ఫ్లిక్స్ లోకి అందుబాటులోకి రానున్నట్లు వెల్లడించారు.

ఇలా ఈ సినిమా ఫిబ్రవరి 27వ తేదీ ఓటీటీలో విడుదల కాబోతుందని తెలియడంతో అభిమానులు ఈ సినిమాని మరోసారి చూసే అవకాశం రాబోతున్నందుకు ఎంతో సంతోషం వ్యక్తం చేశారు.

ఇక ఈ సినిమా మంచి సక్సెస్ అందుకోవడంతో చిరంజీవి అదే జోష్ లో భోళా శంకర్ సినిమా షూటింగ్లో బిజీగా మారిపోయారు.

వైరల్ వీడియో: మహిళను వేధించిన డిప్యూటీ తాసిల్దార్.. చివరకి..?!